37.2 C
Hyderabad
April 26, 2024 22: 40 PM
Slider మహబూబ్ నగర్

రాజ్యాధికారం వైపు బిసిలు అడుగులు వేయాలి

BCs should take steps towards statehood

మహాబుబునగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో బీసీ టైమ్స్ అధినేత సూర్యరావు, దేవరకద్ర నేత బాలకృష్ణ (బాబన్న), తో పాటుగా అఖిల పక్షం ఐక్య వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో 60% పైగా ఉన్న బీసీలు, చట్టసభల్లో 10 శాతం కూడా లేకపోవడం శోచనీయమని, కనుక వెంటనే బీసీలు మేలుకొని ఏకమై పది పదిహేను శాతం ఉన్న ఆగ్రవర్ణాలు ఏలుతున్న ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సంఘటితం చేసి దామాషా ప్రకారం మన హక్కులు మనమే సాధించుకొని మన సీట్లను మనమే సాధించుకోవాలని చెప్పారు.

అంతేకాకుండా మనతో పాటు ఎస్సీ ఎస్టీల మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ కోరారు.

వనపర్తి నియోజకవర్గంలోని వనపర్తి పట్టణ మున్సిపాలిటీలో రెండు కులాలు కలిస్తేనే ఒక చైర్మన్ సీటు సాధించే సీట్లు సంపాదించారని, ఒక మూడు కులాలు కలిస్తే ప్రతి నియొజకవర్గంలో ఎమ్మెల్యే సీటు బీసీలే గెలుస్తారని దాన్నిబట్టి బీసీలే రాజ్యాధికారం చేపడతారని దీన్ని చూసైనా బీసీలు మారి ఏకం కావాలని పిలుపునిచ్చారు.

రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలలో బిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. సమావేశంలో బీసీ టైమ్స్ అధినేత సూర్యరావుతో పాటు దేవరకద్ర నియోజకవర్గం నాయకులు బాబన్న బుచ్చన్న యాదవ్, మండల నాయకులు దేవరకద్ర నాయకులు, వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, జనంపెట రాములు, అడ్వకేట్ ఆంజనేయులు, పొట్టినేని గోపాలకృష్ణ, రమేష్ పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

గురుమూర్తిని గెలిపించాలని వెంకటగిరిలో ఇంటింటి ప్రచారం

Satyam NEWS

కుటుంబ సభ్యులు వీడియో తీస్తుండగానే ఆత్మహత్య

Satyam NEWS

టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల

Satyam NEWS

Leave a Comment