39.2 C
Hyderabad
April 28, 2024 14: 33 PM
Slider గుంటూరు

నరసరావుపేటలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

bengal gram

గుంటూరు జిల్లా నరసరావుపేట మార్కెట్ యార్డ్ లో నేడు శనగల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ -క్రాప్ విధానం లో లోటు పాట్లు, రైతులు పాటించాల్సిన విధి విధానాలు,అధికారుల ద్వారా వారికి పూర్తి సహకారం అందేలా సూచనలు చేశారు.

వైస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని, రైతుకు నష్టం కలిగించే పని ఎన్నటికీ ఈ ప్రభుత్వం చేయబోదని తెలియజేసారు. నరసరావుపేట కు సంబంధించి 1600 హెక్టార్లలో సాగుభూమి ఈ-క్రాప్ లో నమోదు చేశారు. ప్రస్తుతం బయట మార్కెట్ లో  క్వింటాల్ సెనగల ధర రూ.3500 ఉండగా ఈ రైతు పక్షపాత ప్రభుత్వం రూ.4875 లకు కొనుగోలు చేస్తుంది.

కందులు క్వింటాలు ధర రూ.4800 ఉండగా ప్రభుత్వం రూ.5800 లకు కొనుగోలు చేస్తుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ S. A. హనీఫ్, gdcc బ్యాంక్ చైర్మన్ వట్టికుంట అంజయ్య, మార్కెట్ A. D. మస్తానమ్మ, పిల్లి ఓబుల్ రెడ్డి, పచ్చవ రవీంద్ర పాల్గొన్నారు.

Related posts

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుని అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Satyam NEWS

విజయనగరం బాణా సంచా షాప్ లకు పోలీసుల వార్నింగ్..

Satyam NEWS

కాకినాడ కలెక్టరేట్ వద్ద మాజీ సైనికుడు ఆమరణ నిరాహార దీక్ష

Satyam NEWS

Leave a Comment