వర్షాలు అధికంగా కురుస్తున్న ప్రాంతాల్లో రైతులు పంటలపై మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశీలనలో తేలింది. ‘అధికంగా ఎరువుల వాడకం వల్ల పంటలపై తెగుళ్ల ఉద్ధృతి పెరుగుతోంది. పైరు మధ్యకాలంలో రెండో దఫాగా యూరియాను ఎకరానికి 15 నుంచి 25 కిలోలు వేస్తే సరిపోతుంది. మొత్తమ్మీద ఎకరానికి ఒక బస్తాకు మించి చల్లరాదు’ అని వర్సిటీ సూచించింది. f