Slider మహబూబ్ నగర్

ఘనంగా భగత్ సింగ్ 113వ జయంతి వేడుకలు

#BhagatSingh

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో భగత్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ 113వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వీరమరణం పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు, యువతకు ఆదర్శంగా నిలిచిన భగత్ సింగ్  జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పాల్గొని భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కొరకు పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్ర ప్రతీ ఒక్కరూ చదివి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

నేటి సమాజంలో విద్యార్థులకు దేశ భక్తుల గురించి అవగాహన కలిగించేలా ప్రభుత్వం పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రతి రోజు విద్యార్థులకు స్వతంత్ర సమరయోధుల జీవితచరిత్రను బోధించాలని కోరారు.

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుల గురించి ప్రతిఒక్కరికీ తెలియజేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీశైలం,వైస్ ఛైర్మన్ షాహేద్,కౌన్సిలర్ భోజి రెడ్డి నాయకులు నాగేష్ గౌడ్,నర్సింహా గౌడ్,అఫ్సర్ పాల్గొన్నారు.

Related posts

కర్నాటక ఫలితాలతో అధికార వైసీపీలో పెరిగిన గుబులు

Satyam NEWS

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు పితృవియోగం

Satyam NEWS

ప్రజా ఫిర్యాదులపై సత్వర పరిష్కారం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!