33.2 C
Hyderabad
March 26, 2025 10: 59 AM
Slider నిజామాబాద్

కంప్లయింట్: తరుగు పేరుతో రైతును కొల్లగొడుతున్నారు

BJP Armoor

వరి కొనుగోలు కేంద్రాలలో క్వింటాలుకు గతంలో  21/2 కిలోలు తరుగు తీసేవారని అయితేఇపుడు 5 కిలోల తరుగు తీస్తూ అది కాకుండా ఇంకా తాలు పేరు మీద క్వింటాలుకు అదనంగా 5 కేజీలు తీస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ మండల శాఖ నిరసన తెలిపింది.

ఈ మేరకు RDO కు వినతి పత్రం సమర్పించారు. అదే విధంగా మక్కల (మొక్క జొన్న) కొనుగోలు కేంద్రాలలో కూడా తరుగు తీసేస్తున్నారని ఇది రైతుకు నష్టం కలిగిస్తున్నదని వారు తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, రైతు తెచ్చిన వరి ధన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేసి హమాలి 40 కిలోల బస్తా కు 10 రూ లకు మించకుండా చూడాలని వారు వినతి పత్రంలో కోరారు.

హమాలి ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల బస్తాలకు 18 నుండి 20 వరకు తీసుకుంటున్నారని వారు తెలిపారు. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. రైతు కి మిల్లర్ కు సంబంధం లేకుండా ప్రభుత్వ మే మిల్లర్లతో మాట్లాడాలి. రైతాంగానికి వెంటనే డబ్బులు వారి బ్యాంకు ఖాతాలలో వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, నుతుల శ్రీనివాస్ రెడ్డి,MPTC లు రాజ్ కుమార్,శ్రీనివాస్ ,ముఖేష్, నర్సా రెడ్డి,పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్,లోక నర్సారెడ్డి, కౌన్సిలర్ లు కొంతం మంజుల మురళి, పాలెపు లతా రాజు, భుపేందర్, రాజ్ కుమార్, కిరణ్, ప్రసాద్,శ్యామ్,శ్రీకాంత్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

19,160 మంది రైతుల ఖాతాల్లో రూ. 23,63,24,250 లు జమ

mamatha

నీలాచలం కొండ వద్ద స్పృహ తప్పిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

Satyam NEWS

హమ్మయ్య..అన్నట్లుగా జరిగిన పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం…!

Satyam NEWS

Leave a Comment