40.2 C
Hyderabad
April 29, 2024 15: 58 PM
Slider విజయనగరం

గ్రీవియన్స్ సెల్ ఫిర్యాదులకు సత్వర న్యాయం

DSP Grevence Cell

ఏపీలోని విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవిన్స్ సెల్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో 42 ఫిర్యాదుల‌ను జిల్లా ఎస్పీరాజ‌కుమారి స్వీక‌రించారు. ఆయా ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఫిర్యాదుల్లో జాప్యానికి అవుతున్న కార‌ణాన్ని పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

ఎన్. కోట మండలం తిమిడికి చెందిన గూనూరు చిన్నమ్మ త‌న వ్య‌వ‌సాయ భూమిని తీసుకొని కొడుకు ఆద‌రించ‌డం లేద‌ని ఫిర్యాదు చేయ‌గా ఎస్పీ స్పందించి విచారణ జరిపి, ఆమెకు న్యాయం చేయాల్సిందిగా ఎస్. కోట ఎస్ఐను ఆదేశించారు. విజయనగరం మండలం జొన్నవలసకు చెందిన బోని శ్రీనివాసరావు త‌న‌ను కొంత‌మంది చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని, కులం పేరుతో దూషిస్తున్నార‌ని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ప్ప‌టికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, న్యాయం చేయాల్సిందిగా ఎస్పీని అభ్య‌ర్థించారు. దర్యాప్తు అధికారితో మాట్లాడి, త్వరితగతిన విచారణ పూర్తి
చేసి, న్యాయం చేయాల్సిందిగా ఆదేశించారు. తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన వెంకట నాయుడు జ ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ చెందిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, తన పార్టీ నాయకులను
కించపరుస్తున్నారని, న్యాయం చేయాల్సింది కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి,
చర్యలు తీసుకోవాల్సిందిగా తెర్లాం ఎస్ఐ ను ఆదేశించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ స్వయంగా ఫోనులో మాట్లాడి, వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదులపై తీసుకున్నచర్యలను వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ బి.వెంకటరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Murali Krishna

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

Satyam NEWS

Vijayanagaram Police: అక్క‌డిక్క‌డే ప‌రిష్కార దిశ‌గా సిబ్బందితో ఫోన్లోనే చ‌ర్య‌లు

Satyam NEWS

Leave a Comment