28.7 C
Hyderabad
April 28, 2024 05: 17 AM
Slider మహబూబ్ నగర్

ధరణి పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

#udaikumar

ధరణి పోర్టల్ కు భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి ఒక చిన్న తప్పు  కూడా దొర్లకుండా త్వరితగతిన పరిష్కరించాలని తాహసిల్దార్లను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్  ప్రజావాణి సమావేశ మందిరంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో 40 ప్రజావాణి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి పోర్టల్​లో నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములు తొలగింపు, భూములు మ్యుటేషన్, భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి కోసం భూ యజమానులు మీ సేవలో చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. భూ సమస్యలకు సంబంధిoచి మూలాలను గుర్తించి వారం రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ తాహసిల్దార్ లను ఆదేశించారు.

అత్యధికంగా అచ్చంపేట రెవిన్యూ డివిజన్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. తహసీల్దార్లతో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత ఆర్డీవో లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ మోతిలాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

ఫారెస్టు అధికారి హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు

Satyam NEWS

యువతికి అండగా నిలిచిన దిశ పోలీసులు

Bhavani

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఎస్ సి కేసు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment