పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి నిరసన వ్యక్తం చేస్తూ కొల్లాపూర్ ఎంఆర్ఓకు భారతీయ జనతా పార్టీ వినతి పత్రం సమర్పించింది.
భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్, సందు రమేష్, మండల అధ్యక్షుడు సాయి కృష్ణ, పానగల్ మండల అధ్యక్షుడు అన్వేష్, పట్టణ అధ్యక్షులు కాకి సత్యనారాయణ గౌడ్, సాయి ప్రకాష్ యాదవ్, కాశీపురం మహేష్, రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
పౌరసత్వ చట్టం వల్ల దేశంలోని ఏ వ్యక్తికి ఎలాంటి అపకారం జరగదని అయినా సరే రాజకీయ లబ్ది కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాజకీయ క్రీడకు తెరలేపారని వారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన సిఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
పౌరసత్వ చట్టానికి భారత దేశ ముస్లింలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వారిలో సందేహాలు రేకెత్తిస్తున్నాయని వారన్నారు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ఈ చట్టం వలన ముస్లిమ్ లకు ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్తున్నా, ఈ దేశం లో ని ప్రతి పక్ష పార్టీ లు మాత్రం తమ తమ ఓటు బ్యాంక్ కోసం ముస్లిం సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తున్నాయని ఎల్లేని సుధాకర్ రావు అన్నారు.