కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు అందరూ తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లోని హైదర్ నగర్ డివిజన్ ప్రాంతంలో మణికంఠ ఫౌండేషన్ మాస్కులను ఉచితంగా పంపిణీ చేసింది. కరోనాను తరిమి కొట్టేందుకు మా వంతు సాయం చేసే ఉద్దేశ్యంతో మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్లు మణికంఠ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రాహుల్ ప్రదీప్ మిత్ర మండలి వెల్లడించారు.
స్థానిక పోలీస్ అధికారులు ఎంతో సహకారం అందచేశారని వారు తెలిపారు. ప్రజా సేవ చేయడమనే ముఖ్య ఉద్దేశ్యంతో స్థాపించిన మణికంఠ ఫౌండేషన్ కరోనను తరిమికొట్టాలి అనే నినాదంతో పని చేస్తున్నదని తెలిపారు. 700 వందల మస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్లు వారు చెప్పారు. కూకట్ పల్లి ప్రాంతంలో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మణికంఠ ఫౌండేషన్ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది అని ఫౌండర్ అండ్ ఛైర్మెన్ రాహుల్ ప్రదీప్ తెలియచేశారు.