40.2 C
Hyderabad
April 29, 2024 18: 17 PM
Slider నిజామాబాద్

తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని బిజెవైఎం డిమాండ్

#bjym

ఖాళీగా  ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద భారతీయ జనతా యువ మోర్చా(BJYM) శాఖ MRO కి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్బంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారని, ఓట్ల కోసమే అసత్యప్రచారాలు చేస్తూ తెరాస ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు. స్వరాష్టం ఏర్పడి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న ఇప్పడి వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా చదుకున్న పట్టభద్రుల ఆత్మహత్యలకు  కెసిఆర్ కారణమవుతున్నరని ఆయన అన్నారు.

2014 నుండి ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా అర్హులైన ప్రతి నిరుద్యోగికీ నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2021 MLC ఎన్నికల సమయంలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానన్న కెసిఆర్ రాష్ట్రం లో 2లక్షల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్న ఇలాంటి ప్రకటన చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వనికి సిగ్గుచేటని ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన చేయాలనీ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం కన్వీనర్ మాటూరి నవీన్ రెడ్డి, మండల బీజేవైఎం ఉపాధ్యక్షుడు దన్నుర్ విట్ఠల్ , బిజెపి ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్, మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైఫుల్లా ఖాన్, మరి ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ పండరి, మైనార్టీ మెక్క అధ్యక్షులు ఖలీల్, కందర్ పల్లి బూత్ అధ్యక్షుడు హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

జీ.లాలయ్య, సత్యంన్యూస్, జుక్కల్

Related posts

అన్న క్యాంటిన్ల మూసివేతపై తీవ్ర నిరసనలు

Satyam NEWS

ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Sub Editor 2

రాయలచెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో భద్రత కొరత

Satyam NEWS

Leave a Comment