26.7 C
Hyderabad
April 27, 2024 07: 24 AM
Slider నిజామాబాద్

నిరుద్యోగులపట్ల ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరు ఇదేనా?

#BJYMKamareddy

కామారెడ్డి జిల్లా టెక్రియల్ జాతీయ రహదారిపై బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రహదారిని దిగ్బంధించారు.

దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనతకృష్ణకు పోలీసులకు కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

అరెస్ట్ చేసిన నాయకులను దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంతకృష్ణ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత పట్ల సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న తీరు సరిగా లేదన్నారు.

ఏ ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో సీఎంకు అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

టీఎస్ పిఎస్సి చైర్మన్ ను నియమించాలన్నారు. నిరుద్యోగ యువత పట్ల సీఎం కేసీఆర్ విధానం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు

Related posts

ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి

Satyam NEWS

‘త‌లైవి’లో అర‌వింద్ స్వామి న్యూ లుక్ కు నీరాజ‌నం

Satyam NEWS

టీడీపీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార జోరు షురూ

Satyam NEWS

Leave a Comment