42.2 C
Hyderabad
April 26, 2024 17: 26 PM
Slider హైదరాబాద్

బలవంతపు స్కూలు ఫీజుల వసూలుపై బిజెవైఎం ధర్నా

#BJYM

కష్ట కాలం లో కాసుల కోసం తల్లిదండ్రులను కష్టపెట్టి ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని బి.జే.వై.యం డిమాండ్ చేసింది.

రాష్ట్ర అధ్యక్షుడు బాను ప్రకాష్ పిలుపు మేరకు  మీడియా సెల్ కన్వీనర్ నాయినేని పవన్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి లోని నారాయణ విద్యాసంస్థల ముందు నేడు బిజే వైయం కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.

జి.ఓ నెంబర్ 46 ను ప్రభుత్వం విడుదల చేసినా కార్పొరేట్ స్కూల్స్ ,కాలేజీ లు వారికి ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కార్పొరేట్ విద్యాసంస్థలు టిఆర్ఎస్ నేతల కనుసన్నుల్లో నడుస్తున్నాయని ఆరోపించారు.

ఈ కరోనా కాలంలో తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి యాజమాన్యాలు, వసూలు చేసిన ఫీజులను అటు అధ్యాపకులకు సరైన జీవితం అందించకుండా సగం జీతం మాత్రమే అందించి యాజమాన్యాలు డబ్బులు దండుకుంటున్నారని  తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా జీవో నెంబరు 46 ను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తును ఆదుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న బి.జే.వై.యం నేతలను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Related posts

రజాకార్ల పాలన గుర్తుకు తెస్తున్న కేసీఆర్

Satyam NEWS

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

Satyam NEWS

చీఫ్ జస్టిస్ గా అరవింద్ బాబ్రే ప్రమాణ స్వీకారం

Satyam NEWS

Leave a Comment