30.7 C
Hyderabad
April 29, 2024 03: 37 AM
Slider హైదరాబాద్

గీత వృత్తిలో మరణాల నివారణపై పుస్తకావిష్కరణ

#srinivasagowd

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక, సంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి, మల్లా గౌడ్ సాహితి సంస్థ ఆధ్వర్యంలో అంబాల నారాయణ గౌడ్ సంపాదకత్వంలో రూపొందించిన “గీత వృత్తిలో మరణాల నివారణ”  పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారన్నారు. అతి ప్రాచీన వృత్తులలో కల్లు గీత వృత్తి కూడా ఒకటి అన్నారు. ఎంతో ప్రాచీనమైనదో అంత ప్రమాదకరమైన వృత్తి గా అభివర్ణించారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల వృత్తి ప్రమాదం జరుగుతున్నా, వందల మంది గీత వృత్తిలో ప్రాణాలు కోల్పోతున్నా ధైర్యం వీడకుండా గీత వృత్తిని కొనసాగిస్తున్న వృత్తిదారులను  అభినందించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత వృత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. తాటి, ఈత చెట్టు రకమును శాశ్వతంగా రద్దు చేశామన్నారు. ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సిన గత బకాయిలను పూర్తిగా రద్దు చేశామన్నారు. గీత వృత్తి ప్రోత్సాహంలో భాగంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో సుమారు నాలుగు కోట్ల 20 లక్షల తాటి, ఈత, గిరిక తాటి చెట్టు మొక్కలను నాటామన్నారు.

గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి ,ఈత చెట్టుపై నుండి పడి మరణించినా, శాశ్వత అంగ వైకల్యం చెందిన రూ. లు.5 లక్షల రూపాయల ఎక్స్ గ్రెసియో అందిస్తున్నమన్నారు. గీత వృత్తిదారులకు ప్రతినెల రూ. లు 2116 రూపాయల పెన్షన్ ను అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వైన్ షాపు ల కేటాయింపులో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లను దేశంలో మొట్టమొదటిసారిగా కల్పిస్తున్నామన్నారు.

గీత వృత్తిలో మరణాల నివారణ కోసం సరళతరమైన తాటి చెట్టు చెక్కే యంత్రాల రూపకల్పన పై దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి వెల్లడించారు. గీత వృత్తిలో మరణాల నివారణ పై అవగాహన పుస్తకాన్ని వెలువరించిన సంపాదకులు అంబాల నారాయణ గౌడ్ ను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడ్, మోకు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అమరవేని నర్సాగౌడ్, ప్రధాన కార్యదర్శి సిద్ధిరాములు గౌడ్ రాష్ట్ర గౌడ సంఘం మహిళ నాయకురాల్లు బత్తిని కీర్తి లతా గౌడ్, మానస, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోనుపునూరి శ్రీకాంత్ గౌడ్, సాయిరాం, విద్యార్థి విభాగం నాయకులు కార్తిక్ గౌడ్, ఎనుకత్తెల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దొంగను పట్టుకున్న చండూర్ సిఐ సురేష్ కుమార్

Satyam NEWS

ఓటమి భయంతోనే బిజెపిని అడ్డుకుంటున్న టీఆర్ఎస్

Satyam NEWS

కౌంటర్ ఎటాక్: బుద్ధి లేకుండా మాట్లాడుతున్న పృధ్వీ

Satyam NEWS

Leave a Comment