28.7 C
Hyderabad
April 28, 2024 08: 36 AM
Slider ఆదిలాబాద్

విద్యా విషయాలలో అందరికి సాయం చేస్తాం

#TDP Adilabad

ఉన్నత విద్యకు ఉపయోగ పడే పుస్తకాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్ మెంట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆపరేటింగ్ సిస్టమ్, పారామెడికల్ ఇంకా మరిన్ని ఉపయోగకరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు  జి.ఆనంద్ తెలిపారు.

కాగజ్ నగర్ పట్టణ ప్రభుత్వ గ్రంథాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ బుచ్చిలింగం జ్ఞాపకార్ధం 44 గ్రంధాలను అందించామని ఆయన తెలిపారు. భగవత్ గీత, మహాభారతం, భాగవతం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఇందులో ఉన్నాయని ఆయన అన్నారు. విద్యార్ధులు ఈ సేవలను వినియోగించుకోవచ్చునని ఆయన అన్నారు.

పుస్తకాల్ని లైబ్రేరియన్ కరుణ కుమారి, డైరెక్టర్ గిరీష్ కుమార్ లకు అందించామని ఆయన తెలిపారు. రానున్న రోజులలో బుచ్చిలింగం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సామాజిక కార్యక్రమాలు చేపడతామని అన్నారు.  ఈ కార్యక్రమంలో తెదేపా పార్లమెంట్ అధికార ప్రతి మీర్ సాధిక్ అలీ , కార్యనిర్వాహక కార్యదర్శి పి.సురేష్ కుమార్, TNTUC నాయకులు సీహెచ్. ప్రభాకర్,కె. సుదర్శన్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ శారద పీఠంలో ముగిసిన యాగం

Satyam NEWS

మాలలను సంఘటితం చేసి పోరాటం చేయాలి: మంత్రి నర్సింహయ్య

Satyam NEWS

మంత్రి బొత్స సత్యనారాయణ తాచుపాము

Satyam NEWS

Leave a Comment