42.2 C
Hyderabad
April 26, 2024 18: 36 PM
Slider గుంటూరు

ఇన్ జస్టిస్: అన్నా క్యాంటిన్లు మూసివేయడం అన్యాయం

TDP NRT

పేదవారికి పట్టెడన్నం పెట్టడం కన్నా రాజకీయ పరమార్థం ఇంకేముంటుంది అని సెలవిచ్చిన అన్న నందమూరి తారక రామారావు మాటలే స్ఫూర్తిగా ప్రారంభించిన అన్న క్యాంటిన్లను వైసిపి ప్రభుత్వం మూసేయడం దారుణమని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు.  

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు నరసరావుపేట పట్టణంలో స్థానిక పల్నాడు రోడ్ లోని నాలుగు రోడ్ల కూడలిలో అన్నా క్యాంటీన్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ తో బాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు రాష్ట్రమంతా అన్న క్యాంటీన్ ల వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 అన్నా క్యాoటీన్లు మూసివేశారని ఆయన అన్నారు.

తెలుగుదేశం హయాంలో తక్కువ ధరకు పేదలకు నాణ్యమైన భోజనం అందించామని, అయితే వైకాపా వచ్చిన తరువాత పేదలు అర్థాకలితో పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని అన్నా క్యాంటిన్లను మూసివేయడం తగదని డాక్టర్ చదలవాడ అన్నారు.

ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళతాయి కానీ ఇదేం ప్రభుత్వమో సంక్షేమాన్ని ఆపేస్తున్నదని అన్నారు. ఇసుక లేకపోవడం వల్ల లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన అన్నారు. 1,29,74,958 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనాలు పెట్టాం.

కూలి పని చేసి రోజుకి 15 రూపాయల ఖర్చుతో అన్న క్యాంటీన్ లో మూడు పూటలు కడుపునిండా భోజనం చేసేవారు అలాంటిది ఈ ప్రభుత్వం పేద వాడిని పస్తులు ఉంచుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి నరసయ్య, కడియాల రమేష్, బండరుపల్లి విశ్వేశ్వరరావు, కొట్ట కిరణ్, మక్కెన ఆంజనేయులు, ఇమిడిశెట్టి కాశయ్య, తాండవ కృష్ణ, పోతురాజు, రామూర్తి, ఆలపాటి శ్రీను, గొట్టిపాటి జనార్దన్ బాబు పాల్గొన్నారు.

ఇంకా పునాటి శ్రీను, వల్లెపు నాగేశ్వరరావు, యాడ్స్ వాలి, శ్యాం, మడక ప్రసాద్, పుల్లయ్య, సైదావాలి, ఖాసీం, రఫీ, నగవరపు ప్రసాద్ ,సైదావాలి, దాసరి పుల్లయ్య, మెహర్, సుబ్రహ్మణ్యం, రాము, బ్రహ్మయ్య, మోహన్ రావు, మీరవాలి, శేషమ్మ, విజయలక్ష్మి, సింధు, కుమారి, రాయప్ప, ప్రసాద్, శేఖర్, చెన్నయ్య, సైదమ్మ, బాలు, మధు, చుండ్రు వెంకటేశ్వర్లు కార్యక్రమానికి హాజరయ్యారు

వీరే కాకుండా పత్తి శ్రీను, చింతల శ్రీను, షరీఫ్, అంకమ్మ,నూనె శ్రీను, శ్యామ్, జాన్ వాలి, మెడ సాంబశివరావు, పులుసు అప్పారావు, మేకల సైదారవు, నాగరాజు, సీపీఐ కార్యదర్శి కాసా రాంబాబు, మాజేటి వెంకటేష్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

డ్రగ్స్ మాఫియా ను ప్రశ్నిస్తే తెలుగుదేశం పై దాడి చేస్తున్నారు

Satyam NEWS

ఉద్యోగ ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం

Satyam NEWS

రాజంపేట ఏరియాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment