38.2 C
Hyderabad
April 29, 2024 13: 19 PM
Slider ఆధ్యాత్మికం

అన్నమయ్య జన్మస్థలి తాళ్ళపాక లో వార్షిక బ్రహ్మోత్సవాలు

#tallapaka

వాగ్గేయకారుడు అన్నమయ్య జన్మస్థలి కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ చెన్నకేశవస్వామివారి  ఆలయం, శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆల‌యాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19 సోమవారం నుంచి ప్రారంభం అయ్యి 27 మంగళవారంతో ముగియనున్నాయి.

ఈ రెండు అలయాల్లో వేరువేరుగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గత ఏడాది లాగే  ఈ ఏడాది కూడా కార్యక్రమాలు ఏకాంతంగా ఆలయంలో నిర్వహించనున్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు కూడా ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.ఈ కార్య‌క్ర‌మాల్లో టిటిడి అధికారులు పాల్గొంటారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.

శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో

19 వతేది అంకురార్పణ…

20 ఉదయం ధ్వజారోహణం రాత్రి హంస వాహనం…

21 ఉదయం పల్లకి సేవ, రాత్రి చంద్ర ప్రభ…

22 ఉదయం పల్లకి సేవ రాత్రి చిన్న శేష వాహనం…

23 ఉదయం పల్లకి సేవ,రాత్రి సింహా వాహనం…

24 ఉదయం పల్లకి సేవ ,నంది వాహనం

25 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం అనంతరం గజావాహానం..

26 రాత్రి పల్లకి సేవ

27 ఉదయం పల్లకీ సేవ,రాత్రి పార్వేట ఉత్సవం…

శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో

19 వతేది ఉదయం దీక్షా తిరుమంజనం,అంకురార్పణ

20 ఉదయం ధ్వజారోహణం రాత్రి శేష వాహనం…

21 ఉదయం పల్లకి సేవ, రాత్రి హంస వాహనం..

22 ఉదయం పల్లకి సేవ రాత్రి హంస వాహనం…

23 ఉదయం పల్లకి సేవ,రాత్రి హనుమంతు వాహనం…

24 ఉదయం పల్లకి సేవ ,గరుడ వాహనం

25ఉదయం పల్లకి సేవ, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం అనంతరం గజావాహానం..

26ఉదయం పల్లకీ సేవ, రాత్రి రథోత్సవం

27 ఉదయం పల్లకీ సేవ,రాత్రి అశ్వవాహనం తో బ్రహ్మోత్సవాలు ముగియ నున్నాయి.

Related posts

విమానంలో బట్టలు విప్పేసిన ఇటలీ మహిళ

Bhavani

అనూహ్యంగా ఆర్ధిక శాఖ నుంచి ముగ్గురి సస్పెన్షన్

Satyam NEWS

టీటీడీ అటవీ కార్మికులకు న్యాయం చేయండి

Satyam NEWS

Leave a Comment