28.7 C
Hyderabad
April 26, 2024 10: 22 AM
Slider కడప

సిఎం సొంత జిల్లాలో అడ్డులేని ఇసుక అక్రమ రవాణా

#illegal sand transport

కడప జిల్లా సిద్దవటం మండలం పెన్నా పరివాహాక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నందలూరు చెయ్యేరు నదిలో టంగుటూరు, మర్రిపల్లె లో ఇసుక రీచ్ లకు అనుమతి ఇచ్చారు.

సిద్దవటం లో పెన్నానదిలో అనుమతులు లేవు.కాగా ఇక్కడ ట్రాక్టర్ యజమానులు, ఎద్దుల బండ్ల యజమానులు అనధికారికంగా రాత్రింబవళ్లు ఇసుక ను యధేచ్చగా తరలిస్తున్నారు.

ఇలా తరలించిన ఇసుకను అధిక ధరలకు భవన నిర్మాణ యజమానులకు విక్రయిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం రాత్రిపగళ్లు తేడా లేకుండా ఇసుక తరలించారు.

సామాన్యులకు ఇసుక కావాలంటే సవాలక్ష కారాణాలు చూపే అధికారులు, కాంట్రాక్టర్లను అనుమతులు ఎలా ఇస్తున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఎస్.యి. బి అధికారులకు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్టు వ్యవహా రిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Related posts

మునిసిపల్ దుకాణాల కేటాయింపు కోసం అక్రమ వసూళ్లు

Bhavani

కడప తెలుగు మహిళ పదవికి రాజీనామా

Satyam NEWS

పెండ్యాల కోటేశ్వరరావు జీవితం భావితరాలవారికి ఆదర్శం

Satyam NEWS

Leave a Comment