33.7 C
Hyderabad
April 28, 2024 23: 35 PM
Slider ప్రత్యేకం

బీఆర్ఎస్ ఖాళీ అయ్యే రోజు వచ్చింది: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

#shabbirali

తమ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్న బిఆర్ఎస్ కథ రివర్స్ అయిందని, నేడు బీఆర్ఎస్ పార్టీయే ఖాళీ అయ్యే రోజు వచ్చిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ, బీఆర్ఎస్ నుంచి చేరికల సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని సాధ్యం కాని హామీలు అంటూ పిచ్చి ప్రేలాపన చేసిన కేటిఆర్ నేడు కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై స్పందించాలని డిమాండ్ చేశారు.

తమ మేనిఫెస్టోని కాపీ చేసి ప్రజల్లో పోదామనుకుంటున్నారని విమర్శించారు. పదేళ్లుగా అధికారంలో ఉండి గత మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చలేని కెసిఆర్ ను, ఇప్పటి మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ కు రాజకీయాల నుండి రిటైర్మెంట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను చూసి బి ఫామ్ లు కూడా 51 మందికి ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానని చెప్పిన ఆరు గ్యారెంటీలను కాపీ చేసినట్టుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో కనబడుతుందన్నారు.

గత మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య, అర్హులందరికీ పెన్షన్లు, ఇండ్లు లేని అందరికీ డబుల్ బెడ్ రూంలు, రేషన్ కార్డులు, కోటి ఎకరాలకు సాగునీరు, లక్ష ఉద్యోగాల హామీలలో 10 శాతం కూడా చేయలేదని, ఇప్పుడేమీ ఉద్ధరిస్తావని కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త జిమ్మిక్కులు, అబద్ధాలతో ముందుకు రాబోతున్న‌ద‌ని ప్రజలు ఎవరు కూడా నమ్మరన్నారు.

Related posts

సమగ్ర శిక్షా క్యాలెండర్ ను విడుదల చేసిన ధర్మాన

Satyam NEWS

తెలంగాణ ఆదర్శ పాలనకు ఇది నిదర్శనం

Satyam NEWS

పేర్లు మార్పుతో బతుకులు మారుతాయా ?

Satyam NEWS

Leave a Comment