28.7 C
Hyderabad
May 5, 2024 07: 54 AM
Slider విజయనగరం

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా బస్సులు బంద్

అన్యాయం గా ,అక్రమంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం, చంద్రబాబు ను అరెస్ట్ చేసి 48 గంటల పాటు కస్టడీ లో ఉంచిన కారణంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన పథం చేపట్టారు. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచీ దేశం నేతలు…. కాంప్లెక్స్ లోంచి బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు.

డిపో వద్ద అలాగే కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద భైఠాయించి బస్సులను గమ్యస్థానాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. టీడీపీ నేతలైన ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, బంగారు నాయుడు, జనసేన నేతలు గురాన అయ్యలు… ఇతర కార్యకర్తలు అంతా… సంయుక్తంగా బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఒకానొక సమయంలో పోలీసులు… వాళ్లను లేవమని…బస్సులు వెళ్లేందుకు సహకరించాలని కోరారు.

అయినా పార్టీ నేతలు తమ ,తమ నిరసనలు కొనసాగించారు. కాసేపట్లో విజయనగరం డీఎస్పీ గోవింద్ ,టూటౌన్ సీఐ విజయానంద్ లు మరికొంత మంది పోలీస్ సిబ్బంది వచ్చి… పార్టీ నేతలను లెమ్మని చెప్పగా…పదిగంటల వరకు ఉంటామని టీడీపీ రాష్ట్ర పార్టీ నేత ఐవీపీ రాజు…డీఎస్పీ ని రిక్వస్ట్ చేసిన… రెండు గంటల పాటు ఇచ్చామని.. ప్రయాణీకులకు, ఆర్టీసీ శాఖా తీవ్ర నష్ట వస్తోందని చెప్పారు. అయినా పోలీసులు మాట పెడచెవిన పెట్టడంతో ఇక లాభం లేదని… పోలీసులు…. పార్టీ నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్ లోకి ఎక్కించి… వన్ టౌన్, టూటౌన్ స్టేషన్ లకు తరలించారు.

Related posts

రాజకీయ సన్యాసం తీసుకున్న జానారెడ్డి

Satyam NEWS

కరోనా వైరస్ అంటే రోడ్డు పై భూతం లాంటిది

Satyam NEWS

కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ వేట

Satyam NEWS

Leave a Comment