35.2 C
Hyderabad
May 1, 2024 01: 26 AM
Slider హైదరాబాద్

వర్షాకాలం వస్తున్నది నాలాలు విస్తరించండి

#Arekapudi Gandhi

హైదరాబాద్ శివారులోని చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ నాల విస్తరణ పనులను నేడు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. జలమండలి, ఎలక్ట్రికల్, ఆర్ అండ్ బి, జీహెచ్ ఎంసి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ నాలా విస్తరణ లో భాగంగా ప్రధాన రహదారి పై కల్వర్ట్ నిర్మాణంలో భాగంగా అడ్డుగా వచ్చిన మంచి నీటి పైపులు, కరెంటు స్తంభాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. మంచి నీటి పైప్ లైన్, కరెంట్ స్తంభాలు తొలగించి పనులను సులభతరం చేయాలని అన్నారు.

నాలుగు శాఖల అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించుకొని త్వరితగతిన పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. కరోనా వంటి విపతర్కర పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదనే  ఉద్దేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ  పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని అదేవిధంగా రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.

పనులు నాణ్యత ప్రమాణాలతో  చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుడదని గాంధీ అన్నారు. పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్మిటర్ మెయింటెనెన్స్ వాటర్ వర్క్స్ GM రామకృష్ణ, మేనేజర్ MD అన్వర్, EE చిన్నా రెడ్డి, AE అనురాగ్, R & B DE రామకృష్ణ, ఎలక్ట్రికల్ AE వెంకటేష్ 33 KV లైన్స్ AE ప్రవీణ్, మియపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వాలా హరీష్ రావు, పూర్ణచందర్ రావు, ప్రసాద్ దుబే తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాఠశాల స్వచ్ఛ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలి

Satyam NEWS

U turn: రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేస్తాం

Satyam NEWS

అట్టహాసంగా ఐదవ విడత చేపల పంపిణీ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment