Slider జాతీయం

సేవ్ డెమోక్రసీ: పౌరసత్వ బిల్లును రాజ్యసభలో ఆపండి

muslim leaders

దేశంలో నివసిస్తున్న ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే పౌరసత్వ సవరణ బిల్లు అని ముస్లిం సంఘాల నాయకులు విమర్శించారు. దేశంలోని ముస్లింలను దేశం నుండి బయటకు పంపించే ప్రయత్నమని వారు విమర్శించారు. నిన్న అర్ద రాత్రి లోక్ సభ ఆమోదించిన ఈ పౌరసత్వ సవరణ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారన్నారు.

మౌలానా మాబోల్, కలీముద్దీన్ జమాత్ ఇస్లామ్, మౌలానా ఇషాక్ అలి, మౌలానా జబీఊల్లః, ముఫ్తీ అబ్దుల్ హది ఖశిమి, మౌలానా అబ్దుల్ అలి రశాది, వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి అసిఫ్, వైసీపీ నాయకులు సలీం, టిడిపి నాయకులు ఫత్ ఉల్లా, టిడిపి మొహిద్దిన్, ఎంహెచ్ పిఎస్ ఫారూక్ షుబ్లీ  తదితురులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశాన్ని హిందూ రాష్ట్రం వైపు అడుగులు వేసే విధంగా చేసే ప్రక్రియ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని వారు అన్నారు. కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, ఆకలి దళ్, జే డీ యు, జనతా దళ్, ఏ ఐ ఎ ఏం డి కె, CPI, CPM, టిఆర్ఎస్ లాంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నా బిల్లు ను లోక్ సభలో నెగ్గించుకోవడం నియంతృత్వం కిందికి వస్తుందని వారన్నారు.

పార్లమెంట్లో 350కి పైగా మెజారిటీ ఉన్నందు వల్ల ఎలాగో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కానీ రాజ్యసభలో మాత్రం కష్టమేనని వారన్నారు. దక్షిణ భారత దేశ స్థానిక రాజకీయ పార్టీల నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుందని అందువల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. త్రిపుల్ తలాక్ బిల్లు మాదిరిగా దీన్ని పట్టించుకోకపోతే రాబోయే తరాలు మిమ్మల్ని క్షమించవని వారు హెచ్చరించారు.

Related posts

కూలీల ఆటో బోల్తా.. 9 మందికి తీవ్ర గాయాల

mamatha

రాజధాని అమరావతి కోసం కన్నా దీక్ష ప్రారంభం

Satyam NEWS

ఎలక్షన్ కోడ్ వచ్చినా కార్యాలయాన్ని ఖాళీ చేయని మంత్రి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!