38.2 C
Hyderabad
April 28, 2024 20: 54 PM
Slider ఖమ్మం

కారు కు వున్న టిన్టెడ్ గ్లాస్ (సన్ ఫిల్మ్) తొలగించాలి: ట్రాఫిక్ ఏసీపీ

#Traffic ACP

కార్లకు వున్న టిన్టెడ్ గ్లాస్ (సన్ ఫిల్మ్) తొలగించాలని,లేకుంటే జరిమానా తప్పదని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి తెలిపారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలు కార్ల సన్ ఫిల్ములను తొలగించారు.

వాహనాలకు నల్లటి ఫిల్ములు కలిగిన అద్దాలను ఉపయోగించి తద్వారా అత్యాచారాలు, అపహరణలు మొదలైన అసాంఘిక నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వీటిని అదుపు చేసేందుకు గానూ వాహనాలకు నల్లటి ఫిల్ముల ఉపయోన్ని సుప్రీం కోర్టు నిషేధించిన విషయం అందరికి తెలిసిందేనని,

ఈ మేరకు ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, వాహనాల అద్దాలకు పరిమితులకు మించి టింట్ చేయబడి ఉన్నట్లయితే జరిమానా విధంచడమే కాకుండా వెంటనే సన్‌ఫిల్మ్‌లను తొలగించడం జరుగుతుందన్నారు.

“మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌ స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండో (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి”.

సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుందని,కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్‌లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుందన్నారు.

కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ఆశోక్ పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ లో రేపు మాంసం దుకాణాలు బంద్

Satyam NEWS

కురుమ విద్యార్ధుల ఉన్నత చదువులకు సహకరిస్తా

Satyam NEWS

మురుగనీరు వస్తున్నా పట్టించుకోని మునిసిపల్ అధికారులు

Satyam NEWS

Leave a Comment