30.7 C
Hyderabad
April 29, 2024 06: 52 AM
Slider ప్రత్యేకం

వివేకా మర్డర్ కేసులో కడప ఎంపిపై ప్రశ్నల వర్షం

#avinashreddy

ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకే సీబీఐ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి తన లాయర్ ను కూడా విచారణకు అనుమతించాలని సీబీఐ అధికారుల్ని కోరారు. అయితే సీబీఐ అధికారులు అందుకు నిరాకరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీబీఐ బృందం అవినాష్ ను విచారించింది. తొలిరోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ తో పాటు ఆయన ఆర్ధిక లావాదేవీల గురించి ప్రశ్నలు సంధించారు. ఈ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ చేసిన విజ్ఞప్తిని సీబీఐ అధికారులు మన్నించారా లేదా అన్నది తేలలేదు. రేపు కూడా ఆయనను విచారణకు సీబీఐ పిలిపించే అవకాశం ఉందని చెప్తున్నారు.

Related posts

ఉత్సాహంగా ములుగు జిల్లా స్థాయి ఆటల పోటీలు

Bhavani

ప్ర‌త్యేకాధికారులు వ‌చ్చిన‌ప్పుడు స్పందించండి

Satyam NEWS

జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వని మోడీ, అమిత్ షా

Satyam NEWS

Leave a Comment