40.2 C
Hyderabad
April 26, 2024 13: 03 PM
Slider నల్గొండ

రైతులకు నష్టం కలిగించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

#KisanSangh

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు.

మంగళ వారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గంలోని చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో చట్టం కాపీలను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేశారని అయినా ప్రభుత్వం మొండిగా అమలు చేయడానికి పూనుకోవడం సరికాదన్నారు.

రైతును భూమి కి దూరం చేసి కార్పొరేటు, గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టం తీసుకురావడం సిగ్గుచేటన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలతో కరెంటు ను ప్రైవేటీకరణ, సబ్సిడీ ల ఎత్తివేత, ఛార్జీల పెంచటం కార్పొరేట్ సంస్థలకు అమ్మటం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు.

రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగ మార్కెట్ యార్డ్ లను ప్రైవేటీకరించడం చిన్న సన్నకారు రైతులను మార్కెట్లకు దూరం చేయడం అంబానీ  అదానీ లాంటి పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసమే నని భావిస్తున్నామన్నారు.

కార్పొరేట్ వ్యవసాయం పేరుతో ముందస్తు ఒప్పందం రైతులు భూమి నుండి దూరం చేసి భూమి యజమాని నీ కూలి గా మార్చడమే నని ,బహుళ  జాతి కంపెనీలకు కట్టబెట్టడం, భూములను కార్పొరేట్ సంస్థలకు ఆమ్మటమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా  నాయకులు జిట్టా నగేష్ ,జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షులు అవిషెట్టి శంకరయ్య ,రైతు  సంఘం నాయకులు ఐత రాజు   నర్సింహ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు  నారబో యిన శ్రీనివాస్ ,కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పామన గుండ్ల అచ్చాలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కత్తుల లింగ స్వామి, శీలం రాజయ్య, పెద్దలు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సౌకర్యాలు కల్పించకుండానే మేళా హాస్యాస్పదం….

Satyam NEWS

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు

Satyam NEWS

Leave a Comment