38.2 C
Hyderabad
April 29, 2024 22: 05 PM
Slider నల్గొండ

రైతుల పోరాటానికి కేంద్రం స్పందించకపోవడం శోచనీయం

#citu hujurnagar

వ్యవసాయ 3 చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ నగర నడి బొడ్డులో ఆరు మాసాలుగా రైతులు పోరాటం చేస్తున్నా   బిజెపి ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పరిశ్రమ ప్రాంతంలో సి ఐ టి యు ఆధ్వర్యంలో శనివారం మూడు వ్యవసాయ చట్టాల జీవో లను దగ్ధం చేసిన అనంతరం రోషపతి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి బిజెపి ప్రభుత్వం ఏ ఘనకార్యం చేయలేదని, 2014 ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని,అన్ని రకాల ప్రజలని అన్యాయం చేస్తూ కొత్త చట్టాలతో ఆదాని, అంబానీల ఆస్తులు పెంచుతూ గుజరాత్  పెట్టుబడిదారుల పాలన దేశవ్యాప్తంగా చేస్తున్నారని విమర్శించారు.తక్షణమే రైతులు,కార్మిక వ్యతిరేక చట్టాలను సవరణలు చేయకపోతే ప్రజలు,కార్మికులు, ఉద్యోగులు తిరుగుబాటు చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు చింతకాయల పర్వతాలు,రామారావు,నరసింహారావు, పద్మ,కోటమ్మ,శ్రీను, వెంకటేశ్వర్లు,మంగ,  రాజి, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Related posts

అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Satyam NEWS

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

సీక్రెట్ జీవోలు ఎందుకు? విసుక్కుంటున్న అధికారులు

Bhavani

Leave a Comment