42.2 C
Hyderabad
April 26, 2024 18: 22 PM
Slider తూర్పుగోదావరి

చింతలపూడిలో చంద్రబాబు దిష్టబొమ్మ దహనం

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నేడు ఆయన దిష్టిబొమ్మను వైసీసీ దహనం చేసింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెబుతూ, దానికి నిరసనగా చింతలపూడి పట్టణంలో చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసిన అనంతరం వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా దళితుడై నందున ఎమ్మెల్యే పై నిరాధారమైన ఆరోపణలు చేశారని, చంద్రబాబుకు దమ్ముంటే ఎమ్మెల్యే పై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో చంద్రబాబు,

చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి పట్టణ అధ్యక్షులు కోప్పుల నాగేశ్వరరావు , చింతలపూడి సొసైటీ చైర్మన్ ఆత్కూరి సుబ్బారావు, చింతలపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇమ్మానుయేలు, చింతలపూడి సొసైటీ డైరెక్టర్ నిమ్మగడ్డ దుర్గా రావు, దినేష్, గోల్కాండ సురేష్,వైస్ ఎంపిపి వరలక్ష్మి,ఎమ్మేల్యే సోదరుడు జీవన్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కాంతారావు,గంధం చంటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతిపై జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS

ఏపిలో వేద పాఠశాలలకు త్వరలో మహర్దశ

Satyam NEWS

కాబూల్‌ లో మెథామ్‌ విక్రయం..

Sub Editor

Leave a Comment