31.7 C
Hyderabad
May 2, 2024 07: 51 AM
Slider ఆంధ్రప్రదేశ్

రిజెక్ట్: ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఒప్పుకోం

TDP revers

మూడు రాజధానులపై మొండిగా ముందుకు వెళుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రతిపక్షనాయకుడు ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. భావితరాల కోసం పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని చంద్రబాబునాయుడు చెప్పారు. మూడు రాజధానులు ప్రతిపాదిస్తూ హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఒప్పుకోబోమని చంద్రబాబు తెలిపారు. అరెస్టులు చేయించడమనేది పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర విభజన బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఇంతగా బందోబస్తు పెట్టలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

నగర నడిరోడ్డుపై డ్రంక్ అండ్ డ్రైవ్… ట్రాఫిక్ ఎస్ఐ కి అడ్డంగా బుక్….!

Satyam NEWS

బిచ్కుందలో భాజా భజంత్రీల మధ్య గణపయ్య నిమజ్జనం

Satyam NEWS

కరోనా మాస్క్ లపై ప్రకాశం జిల్లా ఎస్ పి అవగాహనాకార్యక్రమం

Satyam NEWS

Leave a Comment