39.2 C
Hyderabad
April 30, 2024 19: 59 PM
Slider ప్రత్యేకం

కొత్త వేరియంట్లు తప్పవు

new variants will come

రాబోయే రోజుల్లో మరిన్ని కరోనా కొత్త వేరియంట్లు తప్పవని గాంధీ దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే ఒక వేరియంట్ నుంచి మరో వేరియంట్ పుట్టడానికి ఆర్నెల్ల సమయం పడుతున్నదని, లెక్కన జూన్ లేదా జూలైలో కొత్త వేరియంట్ వచ్చే అవకాశం ఉన్న దని వెల్లడించారు. వైరస్ తగ్గు ముఖం పట్టడంతో ప్రజల్లో మళ్లీ నిర్లక్ష్యం మొదలైందని, వైరస్ పూర్తిగా తొలగిపోలేదన్న విష యాన్ని గుర్తుపెట్టుకోవా కోవాలని సూచించారు. కొత్త వేరియంట్ రావటం పక్కా. కానీ దాని తీవ్ర తపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. అది వేర్లా వస్తుందా? లేదా? అన్నదీ అంచనా వేయలేం. ఏదైనా వైరస్ మ్యుటేషన్ చెందటం సర్వసాధారణం. కరోనా విషయంలోనూ అది జరుగుతుండటం. మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తు తం వైరస్ తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర పరిణామా లకు దారితీసే ప్రమాదం లేకపో లేదు. సాధ్యమైనంత వరకు ప్రజ లు కరోనా నియమాలు పాటించా ల్సిందే. బహిరంగ ప్రదేశాలకు వెళ్లి నప్పుడు మాస్కు పెట్టకోవడం మర్చిపోవద్దు. చేతులకు శానిటై జర్, భౌతిక దూరం తప్పనిసరి. మరికొంత కాలం ఈ కరోనా నియమాలు పాటించాల్సిందే’నని డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.

Related posts

తిమ్మాపూర్ శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Satyam NEWS

హైదరాబాద్ ను ముంచేసిన భారీ వర్షం

Satyam NEWS

ఎట్రాషియస్: కిరాణా వ్యాపారి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment