28.7 C
Hyderabad
April 28, 2024 05: 19 AM
Slider ప్రత్యేకం

ఇన్ స్టా గ్రాం కిలాడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దోచేసింది

#Cheating Lady

ఆన్ లైన్ లో యవ్వారాలు వద్దురా అంటే వినరు. ఇతను ఆన్ లైన్ లో వ్యవహారం నడిపి మూడున్నర లక్షలకు మునిగిపోయాడు. అంతే కాదు మానసిక వేదనతో ఇంత కాలం గడిపాడు. అసలు కథ ఏమిటంటే ఒక యువతి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయింది.

ఇంకేం, అమ్మాయి దొరికింది కాదా అని ప్రొసీడ్ అయ్యాడు అతడు. పరిచయం పెంచుకున్నాడు. ఫొటోలు మార్చుకున్నారు. కబుర్లు చెప్పుకోవడంతో అతడు ఆగలేడు. హాట్ ఫొటోలు అడిగాడు. ఆమె పంపింది. నీవీ హాట్ ఫొటోలు కావాలని అడిగింది. పంపాడు. తర్వాత ఇద్దరూ పరస్పరం ఫొటోలను మార్చుకున్నారు.

ఆ తర్వాత మరింత ముందుకెళ్లి ఇద్దరూ నగ్న వీడియోలను షేర్ చేసుకున్నారు. అతడి నగ్నవీడియోలు ఆమె చేతిలో పడిన వెంటనే ఆమె తన ప్లాన్‌ను అమలు చేసింది. తనకు డబ్బులు ఇవ్వకుంటే తన దగ్గర ఉన్న నగ్న వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీసులోని ఉద్యోగులకు పంపుతానంటూ బెదిరించింది.

దీంతో ఆమె చెప్పినట్టు చేయక తప్పలేదు. వారం రోజుల్లో ఏకంగా రూ. 3.63 లక్షలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. తాజాగా మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాయలాడి కోసం గాలిస్తున్నారు.

Related posts

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి కావాలి

Satyam NEWS

జిల్లా సర్వజన హాస్పటల్ లో హఠాత్ పరిణామం…!

Satyam NEWS

ఏసీబీ ఎదుట లొంగిపోయిన పోలీస్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

Leave a Comment