42.2 C
Hyderabad
April 30, 2024 15: 13 PM
Slider నల్గొండ

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలి

#CITUHujurnagar

సాగు చట్టాలు రద్దుచేయాలని,  విద్యుత్ బిల్లు ఉపసంహరించుకోవాలని గత నాలుగు నెలల నుండి ఢిల్లీ నగరంలో ఆందోళన చేస్తున్న రైతులకు దేశం మొత్తం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూర్యాపేట జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

ఎంతో మంది ఆందోళన చేస్తూ చనిపోయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందించకపోవటం అన్యాయమని ఆయన అన్నారు. రోము నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన విధంగా మోదీ ఉన్నాడని ఆరోపించారు.

చలో ఢిల్లీ లో భాగంగా సికింద్రాబాదు రైల్వేస్టేషన్ లో కార్మికులతో, ప్రజలతో రోషపతి మాట్లాడుతూ త్రేతా యుగంలో సీతాదేవిని కాపాడటం కోసం, రావణుని అంతం కోసం రాముడు వానర సైన్యంతో నది దాటడం కోసం వారధి కట్టాడని,నేటి రైతాంగ పోరాటం మోడీ ప్రభుత్వా పతనానికి నాంది కావాలని కోరారు.

అందుకు ఉడతా భక్తిగా రైతుల కోసం CITU దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటం చేస్తుందని, ప్రతి ఒక్కరు భారతదేశం, రైతుల కోసం పార్టీలకి ఆతీతంగా పోరాటానికి సమైక్యం కావాలని, భారతదేశ రైతులను కాపాడుకోవాలని అన్నారు.

మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని, కార్మిక చట్టాల సవరణ నిలుపుదల చేయాలని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయటం ఆపాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్క  సోమయ్య గౌడ్, శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం సంఘం అధ్యక్ష్య, కార్యదర్శి ఉపతల వెంకన్న, గోవింద్, ఎస్.కె ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Related posts

విలాసాలకు మరిగిన యువకులు చోరీలు చేస్తూ…

Satyam NEWS

కౌలురైతులు సంఘటితం కావాలి

Satyam NEWS

ప్రజలను భయాందోళనకు గురి చేస్తే కఠిన శిక్ష తప్పదు

Satyam NEWS

Leave a Comment