42.2 C
Hyderabad
April 30, 2024 17: 36 PM
Slider ముఖ్యంశాలు

కలెక్టర్ లేకుండా..’జగనన్న తోడు పధకం’ ప్రారంభం..!

#videocofarence

ఇంచార్జి కలెక్టర్ మయూరీ అశోక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్ పంపిణీ

మీరు చదివింది నిజమే… నిఖార్సయిన వార్తే…నమ్మదగిన మేటరే.”సత్యం న్యూస్. నెట్”..ఎల్లప్పుడూ సత్యంమే చెబుతుంది..సత్యమే రాస్తుంది.గత నెల 28వ తేదీన అంటే జులై 28న విజయనగరం జిల్లా కలెక్టర్ గా ఏ.సూర్య కుమారి చార్జ్ తీసుకుని ఏడాది పూర్తయిన తరుణంలో నే అటు జిల్లా ప్రజలు ఇటు జిల్లా యంత్రాంగం లో ఓ అంతుచిక్కని వైనం ఒకటి ప్రస్పటిస్తోంది.

కలెక్టర్ గా ఇలా ఏడాది పూర్తి చేసుకున్న రోజు తర్వాత.. కలెక్టర్ మరి కనిపించలేదు. గడిచిన కొద్ది రోజులుగా కలెక్టర్.. నోటి కి మాస్క్ పెట్టుకుని ప్రతీ ప్రొగ్రాం నిర్వహిస్తున్పారం.ఆ తర్వాతే జరుగుతున్న కొన్ని కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు కూడా.

ఏమై ఉంటుందని..”సత్యం న్యూస్. నెట్”..ఆరా తీస్తే.. బంగ్లాకే పరిమితం అయ్యారని తెలిసింది.. ఎందుకని వాకబు చేస్తే…జ్వరం తో బాధ పడుతున్నారని భోగట్టా.హోం ఐసోలేషన్ లో ఉన్నారని కూడా టాక్. తాజాగా సీఎం జగన్ తాడేపల్లిగూడెం నుంచీ “జగనన్న తోడు” పధకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం దానికి.. విజయనగరం జిల్లా నుంచీ కలెక్టర్ కాక. జేసీ మయూరీ అశోక్ పాల్గొనడంతో అనుమానం నిజమైంది.

దీనికి తోడు… పౌర సంబంధాల శాఖ కూడా  జేసీని ఇంచార్జి కలెక్టర్ గా అభివర్ణించింది కూడా. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ న్యూస్ నెట్ వర్క్ లో దూసుకుపోతున్న “సత్యం న్యూస్. నెట్”..ఎందుకు కలెక్టర్ .వీసీకి రాలేదని కూపీ లాగితే… విషయం బయటపడింది…8 వ తేదీ నుంచీ రెగ్యులర్ గా డ్యూటీ కి హాజరవుతారని సమాచారం. ఏదైనా ఓ జిల్లా కలెక్టర్.. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్… దూరదృష్టి తో..జిల్లా శాఖా అధికారంలను దృష్టిలో పెట్టుకుని.. ముందు చూపుతో…ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటం.. హేట్సాఫ్ చెబుతోంది… “సత్యం న్యూస్. నెట్.”

Related posts

విజయనగరం నడి రోడ్ పై డ్రంక్ అండ్ డ్రైవ్…!

Satyam NEWS

తల్లి, పిల్లలను కాపాడిన ఘనపురం పోలీస్

Satyam NEWS

సిబిఐటి మెకానికల్ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

Satyam NEWS

Leave a Comment