ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడైన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు బెయిల్ మంజూరు అయింది. ఇదే విషయంలో ఆయనపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఆయన అరెస్టు అయి ఇప్పటికి 105 రోజులు అయింది. 105 రోజులుగా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్న చిదంబరం విడుదల కానున్నారు. రెండు లక్షల పూచీకత్తు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఆయన పాస్ పోర్ట్ స్వాధీనం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది.