28.7 C
Hyderabad
April 27, 2024 04: 41 AM
Slider ఆదిలాబాద్

మట్టి గణపతులను మాత్రమే పూజించండి

#MinisterIndrakaranReddy

ప్రజలు స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  ప్రజలకు మట్టి గ‌ణ‌ప‌తి విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఒక‌ ల‌క్ష మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ను అంద‌జేస్తున్నామ‌న్నారు. పర్యావరణానికి హానీ కలగకుండా మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని  ప్రజలను కోరారు.

వినాయ‌క చవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాలను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని, ఆ విఘ్నేశ్వ‌రుడి ఆశీర్వాదాల‌తో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అకాంక్షించారు. కరోనా మహమ్మారి నుంచి  విముక్తి లభించి, అన్ని విఘ్నాలు తొల‌గేలా చూడాల‌ని ఆ గ‌ణ‌నాథున్ని వేడుకున్నారు.

Related posts

ముఖ్యమంత్రి ప్రసంగం జోష్ తగ్గిందా?

Satyam NEWS

వీఆర్ఏ ల ధర్నా…యాచకునికి వినతి పత్రం…

Satyam NEWS

వనపర్తిలో మూత్ర శాలలు బంద్; కమిషనర్ కు తెలిపినా చర్య నిల్

Satyam NEWS

Leave a Comment