Slider ఆదిలాబాద్

రైతు బందు ఖాతాలు పెండింగ్ లో ఉంచవద్దు

#Chief Secretary of Telangana

రైతు బంధు ఖాతాలు  పెండింగ్ లో ఉండవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ల తో  ఉపాధిహామీ పథకం, రైతు బంధు, మునిసిపాలిటీ లో విలీనమైన  గ్రామాల అభివృద్ది, శానిటేషన్,  ఉపాధిహామీ జాబ్ కార్డుల మంజూరు, గో డౌన్  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థల సేకరణ పై సి యస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సి యస్ మాట్లాడుతూ  అర్హులైన వారందరికి  రైతుబంధు సహాయం అందించాలని పెండింగ్ ఖాతాలను శుక్రవారం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. జాప్యం లేకుండా ప్రాధాన్యత  క్రమం లో పూర్తిచేసే బాధ్యత కలెక్టర్ల దేనని అన్నారు. రాష్ట్రం లో 39 వేలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని పెండింగ్ లో ఉన్న ఖాతాలను జిల్లా మండల  వ్యవసాయ అధికారులు  పరిశీలించి వెంటనే పూర్తి చేయాలన్నారు.

పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చేయండి

కొన్ని జిల్లా లో ఇంకా పట్టే దార్ పాస్ పుస్తకాలు మంజూరు కాలేదని, తహశీల్దార్లు స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పట్టే దారు పాస్ పుస్తకాలు  అందజేయాలని ఈ విషయం లో ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. ఉపాధి హామీ పథకం లో చేపట్టే రైతు వేదికలు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ లకు ఆదేశాలు  జారీ చేశారు. 

గుర్తించి న స్థలం లో రైతు వేదికలను ఈ నెల 18 వ తేదీ లోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. రాష్ట్రం లో రైతు వేదికల నిర్మాణానికి  ప్రభుత్వం అక్టోబర్ 10 వరకు గడువు ఇచ్చినప్పటికీ జూలై 25 వరకు కొన్నయిన పూర్తి కావాలని అన్నారు. కల్లాలు రైతు వేదికల మంజూరు తో పాటు గ్రౌండింగ్ తప్పని సరిగా జరగాలని  ఆదేశించారు.

వీటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు మండలానికి నోడల్ అధికారులు అదనపు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు తరచుగా పర్యవేక్షించి వారం వారం ప్రగతి తో పాటుగా  తనిఖీ చేసిన వివరాలను ఏర్పాటు చేసిన అప్ లో నమోదు చేయాలన్నారు.

రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదిక నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలని అందుకు సంబంధించిన మెటీరియల్ దశల వారీగా కాకుండా ఒకే  సారి తెప్పించి పనులను వేగవంతం చేయాలన్నారు. నియోజక వర్గం లో ఏ మండలాలలో వ్యవసాయ గో డౌన్ లేని చోట అవసరమైన స్థలాన్ని  కేటాయించాలని అదే విధంగా జిల్లా లో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ల కోసం  అవసరమైన స్థలం కేటాయింపు కు కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఉపాధి హామీ పథకం లో అనుసంధానం తో అర్ అండ్ బి ఇరిగేషన్   పంచాయతీ రాజ్  గిరిజన సంక్షేమం ద్వారా గుర్తించిన ప్రాధాన్యత పనులను  ద్వారా  కూలీలకు మరిన్ని పని దినాలను కల్పించాలని అందు కోసం ఉపాధి హామీ నూతన జాబ్ కార్డులను అందజేయాలన్నారు.

మునిసిపాలిటీలలో శానిటేషన్ చర్యలు చేపట్టాలి

మునిసిపాలిటీ లలో కోవిడ్ 19  ప్రబలుతున్న నేపథ్యం లో  శానిటేషన్ చర్యలు స్పష్టంగా కనపడాలని  మునిసిపాలిటీ లో కలిసిన గ్రామాల్లో బడ్జెట్ లో 1/3బడ్జెట్ కేటాయించి ఆ గ్రామాల్లో అభివృద్ది చేపట్టిన  పనులు  ద్వారా పట్టణ ప్రాంతంగా అగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని రూపొందించిన బడ్జెట్ మునిసిపల్ చట్టం ప్రకారంగా కేటాయింపులు చేశారో లేదో కలెక్టర్లు పరిశీలన చేయాలన్నారు.

మునిసిపాలిటీ 10 శాతం  గ్రీన్ బడ్జెట్  సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. మునిసిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అరవింద్  మాట్లాడుతూ  విలీనమైన గ్రామాలలో చేపట్టవలసిన  పనులు బడ్జెట్ రూప కల్పన గ్రీనరీ బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేస్తున్న విషయాల పై  జిల్లా కలెక్టర్లు పరిశీలన చేయాలన్నారు.

హరిత హారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి

పట్టణ హరిత హరం లో  4 లేదా 5 వార్డులకు  ఒక నర్సరీ ఏర్పాటు చేసి నాటిన మొక్కలు 85 శాతం పై బడి బ్రతికి లేని పక్షం లో వార్డు ప్రత్యేక అధికారి  వార్డు కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రైతు బందు ఖాతాలు డిబిటి లో పెండింగ్ లో ఉన్న  వాటిని  వెరిఫికేషన్ చేసి రైతుల ఖాతాలో  రెండు రోజులలో జమచేయడం జరుగుతుందని,  రైతు వేదికలు 70 క్లస్టర్ లను మంజూరు చేశామని, అందులో కొన్ని పనులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు.

హరితా హారం లో భాగంగా 52 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ చేసి   ప్రత్యేక అధికారుల ద్వారా నిర్దేశించిన లక్ష్యం మేరకు  ప్రగతి సాధించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇరిగేషన్ పంచాయతీ రాజ్ అర్ అండ్ బి. గిరిజన సంక్షేమం అనుసంధాన పనులు జరుగుతున్నాయని  కళ్ళల నిర్మాణానికి  ఎస్టిమేట్ జనరెట్ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశం లో అదనపు కలేక్టర్ డా,,పి.రాంబాబు,డిఆర్ డిఓ సైలెశ్ కుమార్, డిపిఒ రమేశ్,మున్సిపల్ కమీషనరు శ్రీనివాస్ శాఖాధికరి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో 217 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Satyam NEWS

రియల్లీ :గవర్నర్లలో నేనే యంగ్ గవర్నర్‌ని

Satyam NEWS

Leave a Comment