38.2 C
Hyderabad
April 28, 2024 21: 46 PM
Slider నల్గొండ

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి

#Sheetal Roshapthi

భారతదేశ ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

రైతులకు ఉరితాడుగా మారుతున్న వ్యవసాయ చట్టాలని తక్షణమే రద్దు చేయాలని, పెట్టుబడిదారులకు ఉపయోగపడే ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావుకి వినతి పత్రం ఇచ్చిన అనంతరం రోషపతి మాట్లాడుతూ గత అక్టోబరు మాసంకి రైస్ మిల్లు డ్రైవర్ అగ్రిమెంట్ రెండు సంవత్సరాలు అయిపోయిందని, తిరిగి అగ్రిమెంటు చేయాలని నవంబర్ ఎనిమిదో తారీఖున కోరికలతో కూడిన వినతి పత్రం ఇచ్చినా యాజమాన్య స్పందించక పోవటం సరైనది కాదని అన్నారు.

ఈనాడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. కరోనా కాలంలో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు అందరకీ కూడా యాజమాన్యం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సింగిరికొండ శ్రీనివాస్, ట్రెజరీ కోటేశ్వరరావు,  సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్, రైస్ మిల్లు డ్రైవర్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు గుండెబోయిన వెంకన్న, ఆకం కోటేశ్వరరావు, రెడితి వెంకన్న, కొమ్ము రాములు, బుడిగి శీను, కనకయ్య, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

లక్కీ పోలీస్ :హత్య కేసు విచారిస్తుంటే ఐఎస్‌ఐ ఏజెంటు దొరికాడు

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో నేటి రాత్రి నుండి కర్ఫ్యూ అమలు

Satyam NEWS

భారత్ అగ్ని-5 క్షిపణి పరీక్షలపై చైనా ఆగ్రహం

Sub Editor

Leave a Comment