40.2 C
Hyderabad
April 29, 2024 18: 05 PM
Slider ప్రపంచం

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిలుపుదలకు చర్చలు జరపాలి

#war

రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చైనా ఎల్లప్పుడూ నిష్పాక్షికమైన, న్యాయమైన వైఖరిని మాత్రమే ప్రదర్శిస్తున్నదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు వీలుగా చర్చలు ప్రోత్సహించడానికి తమ దేశం కట్టుబడి ఉందని వెల్లడించారు. శాంతి చర్చలకు పరిస్థితులను సృష్టించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కొన్ని దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. రష్యాతో చైనాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ కు రష్యాతో కొనసాగుతున్న యుద్ధంపై బీజింగ్ ఆందోళన చెందుతోందని, మాస్కోతో రాజకీయ పరిష్కారానికి చర్చలు జరపాలని కోరారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై విధించిన పాశ్చాత్య దేశాల ఆంక్షలను చైనా గతంలో ఖండించింది. NATO, యునైటెడ్ స్టేట్స్ చర్యలు రష్యాను సైనిక చర్యకు ప్రేరేపించాయని ఆరోపించింది.

Related posts

19 నుండి మున్నూరు కాపు చైతన్య యాత్ర

Murali Krishna

హౌ ఆర్ యు: రాయపాటికి చదలవాడ పరామర్శ

Satyam NEWS

2024లో మళ్లీ మేమే గెలుస్తాం

Satyam NEWS

Leave a Comment