29.7 C
Hyderabad
April 29, 2024 09: 15 AM
Slider ప్రపంచం

ముష్టియుద్ధంలో చైనా తరపున ఎంత మంది చనిపోయారో తెలిసిపోయింది

#China Troops

లద్దాక్ లో చైనాతో జరిగిన ముష్టియుద్ధంలో భారతీయ సైనికులు 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మరి చైనా రెడ్ ఆర్మీకి చెందిన వారు ఎంత మంది చనిపోయారు? ఈ విషయం అత్యంత రహస్యంగా ఉంది. చైనా వైపు కూడా సైనికులు చనిపోయారని అంటున్నా ఎంత మంది చనిపోయారో ఇదమిద్ధంగా తెలియలేదు.

ఇదే విషయంపై అమెరికా తన గూఢచారుల ద్వారా రహస్య నివేదికలు తెప్పించుకున్నది. అమెరికా గూఢచారులు ఇచ్చిన నివేదిక ప్రకారం చైనా కు చెందిన దాదాపు 35 మంది సైనికులు చనిపోయారు. అయితే ఈ విషయాన్ని చైనా కూడా రహస్యంగా ఉంచింది.

ఇండియా లాంటి దేశం చేతిలో తమ సైనికులు భారీ ఎత్తున చనిపోయినట్లు ప్రపంచానికి తెలిసే పరువు పోతుందని మృతుల సంఖ్యను చైనా దాచిపెట్టింది. ఇండియా వద్ద సమాచారం ఉన్నా కూడా బహిరంగంగా చెప్పలేదు. మొత్తాన్ని లద్దాక్ లో జరిగిన గొడవలో చైనాకు భారీ నష్టమే వాటిల్లినట్లు ఎట్టకేలకు బయటకు వచ్చింది.

ఈ నేపథ్యంలో చైనా కొద్ది కాలం తర్వాత అయినా ప్రతిఘటిస్తుందని అమెరికా అంచనా వేస్తున్నది. ఈ ప్రతిఘటన ను ఎదుర్కొనాలంటే తమ వద్ద ఉన్న మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించింది.

దాదాపు వెయ్యి పౌండ్ల బరువుగల బాంబులు, మిస్సైల్స్ ను మోసుకొని వెళ్లగల అధునాతన డ్రోన్ లు తమ వద్ద ఉన్నయని, వాటిని సరసమైన ధరకు ఇస్తామని అమెరికా భారత్ తో బేరం పెట్టినట్లు అమెరికాకు చెందిన ఒక ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ప్రచురించింది.

Related posts

కరోనా ఉద్ధృతి తగ్గలేదు జాగ్రత్త: ప్రధాని హెచ్చరిక

Satyam NEWS

ప్రేమ ట్విస్టులతో “అమ్మాయిలు అర్థంకారు”

Bhavani

శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని రైస్ మిల్లు యాజమాన్యాన్ని కోరిన కార్మికులు

Satyam NEWS

Leave a Comment