30.7 C
Hyderabad
April 29, 2024 04: 39 AM
Slider ప్రపంచం

ఎర్ర కోట నుంచి మోడీ చేసిన వ్యాఖ్యలతో చైనాకు ఎక్కడో కాలింది

#ChinaOfficer

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చైనాకు ఒక హెచ్చరికలా పని చేశాయి.

దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఏ చర్యను భారత్ సహించదని, భారత సరిహద్దుల్లో ఎవరు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని ప్రధాని మోడీ చేసిన హెచ్చరికలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకున్నది.

భారత్ నుంచి మళ్లీ విశ్వాసాన్ని పొందేందుకు తాము ప్రయత్నాలు చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝో లిజియాన్ తెలిపారు. చైనాలోని ఒక విదేశీ జర్నలిస్టు భారత ప్రధాని హెచ్చిరికలను ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండు మూడు నెలలుగా భారత సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

ఆ చర్యలను భారత్ ఇక ఏ మాత్రం సహించదని ప్రధాని చేసిన ప్రకటన పై తాము పూర్తి పరిశీలన చేస్తున్నామని లిజియాన్ తెలిపారు. ఉపఖండంలో తాము శాంతి ఉండాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.

Related posts

22న నిఖిల్,అనుపమ పరమేశ్వరన్ “18 పేజిస్” లిరికల్ వీడియో విడుదల

Bhavani

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

Satyam NEWS

బ్రుటల్:పెళ్ళైపిల్లలు ఉన్నాయువతిఫై పెట్రోల్ పోసి నిప్పు

Satyam NEWS

Leave a Comment