క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ ఎదురుగా ఉన్న వెస్లీ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరి,సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తోపాటు మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప, టి ఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని పండగలు ఉన్నా తేదీ(డేట్)మారని పండగ క్రిస్మస్ పండగ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలను మతాలని సమానంగా చూస్తూ వారికి కావాల్సిన పండగ గిప్ట్ లను అందిస్తున్నారు అన్నారు.