కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు,రైతులు,ప్రజలు తిరుగుబాటులో భాగంగా వివిధ రూపాల్లో భారత్ బంద్ సమ్మేను విజయవంతం చేయాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతంలో సి ఐ టి యు ఆధ్వర్యంలో మహిళా ప్రదర్శన సందర్భంగా రోషపతి మాట్లాడుతూ ఈనెల24,25,26 తేదీలలో సూర్యాపేటలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర మూడో మహాసభలును విజయవంతం చేయాలని,24 తేదీన జరిగే ప్రదర్శనలో పెద్ద ఎత్తున శ్రామిక మహిళలు పాల్గొనాలని కోరారు.
ఈ నెల 28,29 తేదీలలో సి ఐ టి యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పాదయాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లాలో కృష్ణ పట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే జీపు జాతను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల మీద పిడుగులాంటి వార్త బస్ చార్జీలు,విద్యుత్ చార్జీలు పెంచాలనే ఆలోచన సరైనది కాదని,తక్షణమే అట్టి ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. వివిధ రూపాల్లో జరిగే కార్మిక,రైతు స్కీం వర్కర్ల సమ్మెలు బందులు పార్టీలకు ఆతీతంగా అందరు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, రైస్ మిల్ దినకూలీల అధ్యక్ష్య, కార్యదర్శులు సాముల కోటమ్మ,మొదాల గోపమ్మ,వెంకన్న,వెంకటమ్మ,గోవిందు దుర్గారావు,పద్మ,ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్