40.2 C
Hyderabad
April 28, 2024 17: 25 PM
Slider నల్గొండ

కొలిక్కి రాని చర్చలు- వాయిదాపడిన సమావేశం

#CITUHujurnagar

రైస్ మిల్లర్స్ అసోసియేషన్  ప్రతినిధులు, కార్మిక యూనియన్ ప్రతినిధులు చర్చలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రైస్ మిల్ డ్రైవర్ల జీతబత్యాలు పెంచడంపై రెండో దఫా చర్చలు జరిగాయి.

సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో అలవెన్సుల విషయాల్లో యాజమాన్యం, కార్మికులు ఒక అంగీకారానికి వచ్చినా కార్మికులు ఉన్న జీతంపై నెలకు మూడు వేల ఐదు వందలు పెంచాలని కోరారు.

అందుకు యాజమాన్యం వెయ్యి రూపాయలు పెంచుతామని అనటంతో వేతనం విషయంలో ఒక కొలిక్కి రాక చర్చలు వాయిదా పడ్డాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,

ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, టి ఆర్ ఎస్ కె వి జిల్లా నాయకుడు పచ్చిపాల ఉపేందర్ తెలిపారు.

పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో CITU నాయకులు ఎలక స్వామి గౌడ్, వెంకన్న, చింతకాయల పర్వతాలు, అంజి,INTUC నాయకులు సలిగంటి జానయ్య, వీరబాబు, శ్రీను

టి ఆర్ ఎస్ టి వి నాయకులు చింతకాయల మల్లయ్య ,ఎర్రయ్య, చలవాది సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ ప్రభుత్వం కూడా ఇంధన ధరలు తగ్గించాలి

Satyam NEWS

కంగ్రాట్స్: కేజ్రీవాల్‌కు ప్రధాని మోడీ అభినందనలు

Satyam NEWS

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సేవలో శ్రీలంక ప్రధాని

Satyam NEWS

Leave a Comment