37.2 C
Hyderabad
April 26, 2024 21: 15 PM
Slider విజయనగరం

కరోనా వ్యాక్సినేషన్: రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ మీటింగ్

#suryakumariias

ప్ర‌తీ గ్రామంలో నూటికి నూరు శాతం కోవిడ్ వేక్సినేష‌న్ పూర్తి చేసేందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌ను త‌యారు చేసుకోవాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. డీపీఓ, డీఎల్‌పిఓలు, ఇఓపిఆర్‌డీలు, పంచాయితీ కార్య‌ద‌ర్శుల‌తో,  జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, వెబెక్స్ మీటింగ్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, గ్రామంలో 18 ఏళ్లు పైబ‌డిన‌ ప్ర‌తీఒక్క‌రికీ వేక్సినేష‌న్  పూర్తి చేయాల‌ని ఆదేశించారు. దీనికోసం ముందుగా స‌ర్వే పూర్తి చేసి, దానికి అనుగుణంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని సూచించారు.

ఎంత‌మందికి మొద‌టి డోసు వేసిందీ, అస‌లు వేక్సిన్ వేయించుకోని వారి విరాల‌ను ముందుగా సేక‌రించాల‌ని చెప్పారు. దానికి అనుగుణంగా వేక్సిన్ డోసుల‌ను తెప్పించుకొని, వేక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని సూచించారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ ప‌థ‌కం కోసం నిర్వ‌హిస్తున్న ఇంటింటి స‌ర్వేని వేగ‌వంతం చేసి,  ఈ నెల 7వ తేదీలోగా పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

నాలుగు విభాగాలుగా జాబితాల‌ను రూపొందించాల‌ని సూచించారు. ఈ ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించి, దానిని ల‌బ్దిదారులు స‌ద్వినియోగం చేసుకొనేలా చూడాల‌న్నారు. ఈ వెబ్ కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా పంచాయితీ అధికారి సుభాషిణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Related posts

అత్యాచార బాధితురాలికి అసభ్య ప్రశ్నలతో ఇబ్బంది

Satyam NEWS

ఘనంగా ప్రఖ్యాత బాడీబిల్డర్ కోడి రామ్మూర్తి జయంతి వేడుకలు

Satyam NEWS

దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బిజెపి…

Satyam NEWS

Leave a Comment