35.2 C
Hyderabad
April 27, 2024 12: 16 PM
Slider విజయనగరం

ఆకస్మిక తనిఖీలలో విజయనగరం ఎస్పీ దీపిక బిజీ బిజీ

#deepika patil IAS

ఏపీ రాష్ట్రంలో “దిశ “ఈ పేరు ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. సీఎం జ‌గ‌న్ మాన‌స పుత్రిక ఏదంటే దిశ‌. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన ఓ అత్యా చార ఘ‌ట‌న‌కు గురైన బాదితులు అస‌లు పేరుకు మారు పేరుగా దిశ‌గా మార్చి త‌ద్వారా స‌మాజంలో మ‌రీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌లో మార్పు తీసుకువ‌చ్చేంద‌కు ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం  ఆ  “దిశ ” పేరుతో ఏకంగా పోలీస్ స్టేష‌న్ల‌నే ప్రారంబించింది. అక్క‌డితో ఆగ‌కుండా ఆ దిశ పేరుతోనే ప్ర‌త్యేకంగా యాప్ ను రూపొందించ‌డం  పోలీస్ శాఖ లో  ఏకంగా  అదే పేరుతో ఏకంగా  ప్ర‌త్యేక శాఖ నే కేటాయించింది సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఆ “దిశ “కు తొలి పోలీస్ అధికారిగా  దీపికా పాటిల్ ఉండ‌గా ఇటీవ‌లే ఆ దిశ‌కు డీఐజీ కేడ‌ర్ పెంచి…విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎస్పీగా ప‌ని చేసిన రాజ‌కుమారీకి డీఐజీగా ప‌దోన్న‌తి కల్పిస్తూ విజ‌య‌వాడ‌కు బ‌దిలీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో  విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీగా దీపికా పాటిల్  ఈ నెల 12 న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణంగా తొలిసారిగా జిల్లా కేంద్రంలోని విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ సర్కిల్ ఆఫీసుకు ఆకస్మికంగా త‌నిఖీ చేసారు. తొలుత రూర‌ల్ పీఎస్ కు వెళ్లి  స్టేష‌న్ లో ఉన్న రికార్డుల‌ను కొత్త‌గా ఏర్పాటు చేసిన రిసెప్ష‌న్ సెంట‌ర్ ను ప‌రిశీలించారు.అక్క‌డ నుంచీ స‌మీపంలోనే పాత ట్రెజ‌రీ  ఆఫీసు ప్రాంగ‌ణంలో ఉన్న రూర‌ల్ సర్కిల్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించారు.  పెండిగులో ఉన్న మహిళల అదృశ్యం, చోరీ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజల్లో  “దిశ ” యాప్ పట్ల అవగాహన కల్పించి, ఎక్కువ మండి మహిళలు యాప్ డౌన్ లోడ్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.పైకి శిథిలావ‌స్థ‌లో స‌ర్కిల్ ఆఫీసు ఉన్న లోప‌ల సీఐ భ‌వనాన్ని ఎస్పీ దీపికా పాటిల్ క్షుణ్ణంగా ప‌రిశృలించారు. స్టేష‌న్ల ప‌రిస్థితిని ,స్థితిగ‌తుల‌ను డీఎస్పీ అనిల్,సీఐ మంగ‌వేణిలు ఎస్పీ దీపికా పాటిల్ కు ద‌గ్గ‌రుండీ చూపించారు. ఇది జ‌రిగిన మ‌ర్నాడే స‌రాస‌రి గ‌జ‌ప‌తి న‌గ‌రం సర్కిల్ స్టేష‌న్ కు ఆకస్మిక ప‌రిశీల‌న‌కు వెళ్లారు. సీఐ ర‌మేష్.. ద‌గ్గ‌రుండీ ఎస్పీ  దీపిక పాటిల్ కు స్టేష‌న్ స్థితి గ‌తుల‌ను, రికార్డుల‌ను చూపెట్టారు.అక్క‌డే ఎంఎస్పీల‌తో ఎస్పీ మ‌మేక‌మై  వారి ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేకించి అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ  నుంచీ తిరుగు ప్ర‌యాణంలో స‌మీపంలోని బొండ‌ప‌ల్లి స్టేష‌న్ న ప‌రిశీలించారు. స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ వాసుదేవ్..ఎస్పీ దీపిక పాటిల్ ను సాద‌రంగా ఆహ్వానించారు. రిసెప్షన్ రికార్డులను పరిశీలించి, ఫిర్యాదులను స్వీకరించే సమయంలో వారితో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని ఆదేశించారు. ఏదైనా డ్యూటీలో జాయ‌న్ అయి  నాలుగు రోజులు అయినా ఇంకా పూర్తి కాలేదు,ఎస్పీ దీపికా పాటిల్ ..ప‌లు స్టేష‌న్ లపై అవ‌గాహ‌న పెంచుకునేందుకు స్పెష‌ల్ బ్రాంచ్ స‌హాకారం లేకుండా  నేరుగా వెళుతున్నారు..ఇక రేపు ఏ స్టేష‌న్ కో అంటూ మిగిలిన స్టేష‌న్ల సిబ్బంది ఎస్పీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న ఎప్పుడైనా ఉంటుంది.. ఎస్పీ ఫోటోల‌ను  కొత్త‌గా ప్రేమ్ చేయించి    స్టేష‌న్ ల‌లో ఏర్పాటు చేసే ప‌నిలో ఉంటున్నారు….సంబంధిత సీఐలు.

Related posts

నీలి మేఘాలలో నేటికీ ప్రతిధ్వనిస్తున్న మధురగానం

Satyam NEWS

రోజూ వేధిస్తున్న కొడుకును చంపేసిన తండ్రి

Satyam NEWS

ప్రపంచ రికార్డు కోసం మహిషాసుర మర్ధని స్తోత్ర గానం

Satyam NEWS

Leave a Comment