తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం జలాలు ఎక్కడ కనిపించినా తెలంగాణ సిఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనవుతున్నారు. తెలంగాణ నలుచెరగులా పారుతున్న కాళేశ్వరం జలాలను ఆయన తనివితీరా చూసుకుని మురిసిపోతున్నారు. నేడు ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి దర్శనానికి బయలుదేరారు.
మార్గమధ్యంలో సిరిసిల్ల – తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదిలో కాళేశ్వరం జలాలు కనిపించడంతో ఆయన అక్కడికక్కడే ఆగిపోయారు. తనివితీరా కాళేశ్వరం జలాలను చూసి గోదావరి మాతకు పూజలు చేసి జలహారతి ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.