30.7 C
Hyderabad
April 29, 2024 06: 57 AM
Slider నిజామాబాద్

నోటికి మాస్కు లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా

#Kamareddy Collector

రైతుల వద్ద ఉన్న వరి ధాన్యం ఈనెల 18 లోపు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కామారెడ్డి జిల్లా  కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం లోని పుల్కల్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

 రైతులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల చొప్పున పెనాల్టీ వేయాలని అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద కు రైతులు ధాన్యం తేగానే ఏ ఈ ఓ లు అనుమతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. తేమ శాతం వచ్చిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. లారీలు సక్రమంగా రావడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

మండల కేంద్రంలోని ముప్పై పడకల ఆసుపత్రిని సందర్శించి కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు .అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

మెక్క గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిలో వైకుంఠధామం నిర్మాణం చేపడదాం అనుకుంటే కొందరు కబ్జా చేశారని అధికారులు సర్వే నిర్వహించి హద్దులు కేటాయించిన కొందరు  హద్దులు తీసేసి కబ్జా చేశారని వైకుంఠ ధామ నిర్మాణానికి అనుమతిని ఇప్పించాలని గ్రామ సర్పంచ్ సయ్యద్ నవాజ్ ఫిర్యాదు చేశారు.

వెంటనే హద్దులు తీసేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి ప్రభుత్వ భూమిని ఆదినంలోకి తీసుకోవాలని తహసిల్దార్ వెంకట్రావు కు కలెక్టర్ ఆదేశించారు. ఖడ్గం గ్రామ శివారు మంజీర పరివాహక ప్రాంతం పక్కన దళితులకు కేటాయించిన భూమి సాగు కోసం వాగులో బోర్లు వేసుకో గా కొందరు కక్షగట్టి అధికారులకు ఫిర్యాదు చేసి దళితులకు చెందిన బోర్లు మాత్రమే తీసి వేశారని తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కు విన్నవించుకున్నారు.

సారూ మాకు కొత్త రేషన్ కార్డులు ఇప్పించరూ?

ఉపాధి హామీలో పని చేస్తున్నారు టెక్నికల్ అసిస్టెంట్లు సమయపాలన పాటించకుండా కూలీలకు అన్యాయం చేస్తున్నారని, వారు స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఏఎంసీ చైర్మన్ రాజు ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్ కార్డు బియ్యం రావడం లేదని ప్రజలు కలెక్టర్ కు విన్నవించుకున్నారు.

అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని, ఏఎన్ఎం అంగన్వాడీ కార్యకర్తల వద్ద బాలింతలు గర్భిణుల రికార్డులు నమోదు తప్పని సరిగా చేయాలన్నారు.

మాతా శిశు మరణాలు లేకుండా చర్యలు

చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం వేయాలని సూచించారు. ప్రతి సోమవారం ఆరోగ్య కేంద్రాలు గర్భిణీలకు వైద్య పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి గురు, శనివారం రోజున అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య,ఆశ కార్యకర్తలు కేంద్రాలకు వెళ్లి నమోదైన గర్భవతుల సంఖ్యను పరిశీలించాలని సూచించారు. మాతృ శిశు మరణాలను జరగకుండా చూడాలన్నారు.

ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరై ఏ విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. పని అడిగిన ప్రతి కూలికి పని కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నీటి సంరక్షణ పనులు ఉపాధి హామీలో చేపట్టాలని సూచించారు మండలంలో 14వేల 136 జాబ్ కార్డులు ఉన్నాయని  తెలిపారు.

శ్రమశక్తి సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి చేపట్టాలని కోరారు. కూలీల సంఖ్య పెంచకపోతే  ఎంపీడీవో, ఏపీవో టెక్నికల్ స్టెంట్లపై  లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డివో రాజేశ్వర్, తాసిల్దార్ వెంకట్రావు ఎంపీడీవో ఆనంద్ సిడిపిఓ వైష్ణవి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

జూన్ 1 నుంచి వినియోగంలోకి శిల్పారామం

Satyam NEWS

నాణ్యమైన రోడ్లతో మరింత అభివృద్ధి

Bhavani

గోపాలపురం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొన్న కెప్టెన్ ఉత్తమ్

Satyam NEWS

Leave a Comment