38.2 C
Hyderabad
April 29, 2024 12: 55 PM
Slider ముఖ్యంశాలు

ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నూతన కలెక్టర్లు సమర్థవంతంగా నిర్వర్తించాలి

#someshkumarias

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు ఎంతో దూరదృష్టితో, ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.

శనివారం 9 జిల్లాల నూతన కలెక్టర్లతో హైదరాబాద్ నుండి ధరణి పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ల ప్రక్రియను పారదర్శకంగా కొనసాగుతుందన్నారు.

కలెక్టర్ ల ఆధీనంలో కొనసాగు తున్న ధరణి పోర్టల్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి అవగాహన తో ఉండాలని సీఎస్ నూతన కలెక్టర్లకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీసీఎల్ఏ అధికారులు పిపిటి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యుటేషన్, పట్టాదారు పాస్ బుక్ తదితర వివరాలపై అవగాహన కల్పించారు.

నాగర్ కర్నూల్ నుండి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఈ డి ఎం నరేష్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రధాని కరుణా కటాక్షం ఈ సారి లభించేనా?

Satyam NEWS

కెరటం నేర్పే పాఠం

Satyam NEWS

నో ఫెస్టివల్: భోగిమంటల్లోజీఎన్‌రావు బోస్టన్‌ నివేదికప్రతులు

Satyam NEWS

Leave a Comment