38.2 C
Hyderabad
April 28, 2024 19: 46 PM
Slider ముఖ్యంశాలు

ముందస్తు అనుమతుల పేరుతో రెండు కోట్ల రూపాయలు స్వాహా

#uttam

హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన,ధర్నా

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుండి మున్సిపాలిటీగా అయినంత వరకు సంక్రమించిన 100 కోట్ల రూపాయల విలువైన లే అవుట్ భూములు,విలువైన డాక్యుమెంట్లు మాయం అయ్యాయని,వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం మున్సిపాలిటీ ఆస్తులను కాపాడాలని,తొమ్మిది నెలలుగా మున్సిపాలిటీ సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, మున్సిపాలిటీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు, మున్సిపాల్టీ కౌన్సిలర్లతో భారీ ఎత్తున నిరసన,ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ ఉత్తమ్, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొని ప్రసంగించారు.హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో యం.పి ఉత్తమ్ క్యాంపు కార్యాలయం నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

హుజూర్ నగర్ పోరాటాల గడ్డ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతమని ఉత్తమ్ అన్నారు.హుజూర్ నగర్ లో దొంగల ముఠా తయారయ్యి భూములు కబ్జాలు చేస్తున్నారని అన్నారు.ఎంపీ స్థాయిలో  ఎన్నిమార్లు అధికారులకు పిర్యాదు చేసిన ఒక్క అధికారి స్పందించలేదని అన్నారు.

9 నెలలుగా హుజూర్ నగర్ లో జనరల్ బాడీ సమావేశం జరగలేదని,మున్సిపల్ చట్టాన్ని తుంగలో తొక్కారని అన్నారు. సమావేశం నిర్వహించకుండానే 2 కోట్ల రూపాయల నిధులను అడ్డగోలుగా కాజేశారని ఉత్తమ్ ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ తో స్వయంగా మాట్లాడానని తాను ఎవరికో భయపడుతున్నారని అన్నారు.

మున్సిపల్ చట్టాన్ని దుర్వినియోగ చేస్తే కోర్టుకు వెళ్తామని,ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని అన్నారు.మున్సిపాలిటీలో ఏ.ఈ,డి.ఈ ల లాగిన్ లు దొంగిలించినా స్వయంగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కమీషనర్ సంతకాన్ని పోర్జరి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి విచారణ జరపకుండా కేసును నీరు గార్చారని అన్నారు.మున్సిపాల్టీకి గతం నుంచి వారసత్వంగా వస్తున్న భూములను అక్రమంగా కాజేశారని ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

వందల కోట్ల రూపాయల విలువ గల భూముల డాక్యుమెంట్లను దొంగతనంగా కాజేసి అమ్ముకున్నా కమీషనర్ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అని,కమీషనర్ ఎందుకు,ఎవరికి భయపడుతున్నారని,ఎవరి కోసం మున్సిపాలిటీ లే అవుట్ భూములను వదిలేస్తున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా సాయిబాబా దియేటర్ రోడ్డులో గల లే అవుట్ స్థలంలో ఇంటి గ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేస్తే శంఖు స్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాన్ని కూడా కబ్జా చేశారని అన్నారు.ఈ స్థలం సూర్యాపేటకు చెందిన బీరవోలు సోమి రెడ్డి 25 సంవత్సరాల క్రితం నాటి గ్రామ పంచాయతీకి లే అవుట్ స్థలం క్రింద 5,500 గజాల స్థలాన్ని ఇచ్చారని,ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత బీరవొలు సోమి రెడ్డికి ఎట్లా చేరింది అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత హుజూర్ నగర్,నేరేడుచర్ల మున్సిపాలిటీ లకు 40 కోట్లు మంజూరు చేస్తే ఆ పనులు మున్సిపాలిటీలో పాలక వర్గం తీర్మానం చేసి మున్సిపాలిటీ ద్వారా పనులు చేయాల్సి ఉండగా ఎమ్మెల్యే సైదిరెడ్డి నిబంధనలను తుంగలో తొక్కి అధికార అహంకారంతో ఆ నిధులను పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంటుకు మార్చి వారి ద్వారా పనులు చేయాలని నాటి కలెక్టర్ వినయ కృష్ణా రెడ్డి కి లేఖ రాయగా వెంటనే కలెక్టర్ లేఖ రాసి దొడ్డి దారిన పనులు చేపట్టేలా చేశారని,ఈ విషయంపై హుజూర్ నగర్,నేరేడుచర్ల కౌన్సిలర్స్ హైకోర్టులో ఫిర్యాదు చేసి పనులు నిలుపుదల చేశారనీ గుర్తు చేశారు.

హుజూర్ నగర్ పట్టణంలో నాటి నేటి మంత్రి చే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు మొదట 75 లక్షల రూపాయలతో శంఖు స్థాపన చేసి ఆ భూమిని కబ్జా చేసుకొని తిరిగి ఎన్ ఎస్ పి క్యాంపులో ఆ కార్యాలయాలను కూల్చి వేసి,అదే మంత్రి జగదీష్ రెడ్డి చే 7 కోట్ల 50 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంఖు స్థాపన చేశారనీ,కేవలం 10 శాతం కమీషన్ల కోసమే ఈ దుర్మార్గానికి తెర లేపారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వజమెత్తారు.

తక్షణమే మున్సిపాలిటీ స్థలాలను కాపాడాలని,ప్రతి నెల మున్సిపాలిటీ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ కమీషనర్ శ్రీనివాస రెడ్డి కి సూర్య పేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖర్జున రావు,పి. సి.సి డెలిగేట్ అల్లం ప్రభాకర్ రెడ్డి,దొంగరి వెంకటేశ్వర్లు,రైల్వే బోర్డు సభ్యుడు యరగాని నాగన్న గౌడ్,మాజీ మార్కెట్ చైర్మన్ సాముల శివారెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిజాముద్దీన్,మంజు నాయక్, చెక్కర వీరారెడ్డి,కొణతం చిన్న వెంకటరెడ్డి, అంజిరెడ్డి, పిసిసి జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్,కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,తేజావత్ రాజా నాయక్, కారింగుల విజయ వెంకటేశ్వర్లు,సరిత వీరారెడ్డి,వరలక్ష్మి నాగరాజు,ధనమ్మ జైలు, కాంగ్రెస్ నాయకులు నవీన్ నాయక్,శిలువ చంద్రశేఖర్,మేళ్ళచెరువు ముక్కంటి,శెట్టి రామచంద్రయ్య,ఇంద్రారెడ్డి,జక్కుల మల్లయ్య,సైదా,శివరాం యాదవ్,జింజిరాల సైదులు,ముడెం సాయి కిరణ్ రెడ్డి,కరీమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఐదు రోజుల జిల్లా పర్యటన

Satyam NEWS

కుల్గాంలో ఉగ్రదాడులు.. కూలీలపై కాల్పులు.. ఇద్దరు మృతి

Sub Editor

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన సమయాల పెంపు

Satyam NEWS

Leave a Comment