33.7 C
Hyderabad
April 29, 2024 00: 39 AM
Slider విజయనగరం

రాత్రి పూట ప్రధాన జంక్ష‌న్ల వ‌ద్ద విజయనగరం ఎస్పీ త‌నిఖీలు

#vijayanagaram police New

రాష్ట్ర వ్యాప్తంగా జులై 1 నుంచీ తొమ్మిది జిల్లాల్లో క‌ర్ఫ్యూ స‌మ‌యాల‌ను  ప్ర‌భుత్వం పొడిగించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో  విజ‌య‌న‌గ‌రం  జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ ఒక్క రోజు ముందుగానే శాఖా సిబ్బందిని సెట్ కాన్ఫ‌రెన్స్ ద్వారా అలెర్ట్ చేసారు కూడా.

రాత్రి  తొమ్మిది అయితే వ్యాపార వాణిజ్య కార్య‌కాలాపాలు మూసేయించాల‌ని…ఆ విధంగా సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు.

ఈ మేర‌కు రాత్రి తొమ్మిది గంట‌ల‌కు ఆఫీసు నుంచీ బంగ్లాకు వెళ్లే స‌మ‌యంలో ఒక‌సారి న‌గరం మొత్తం విస్తృతంగా తిరిగి ఆక‌స్మిక తనిఖీలు చేసారు.

ఇందులో భాగంగా డీపీఓ నుంచీ గూడ్స్ షెడ్ మీదుగా సీఎంఆర్, క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి,గంట‌స్తంబం, కోట జంక్ష‌న్,బాలాజీ,ఆర్టీసీ కాంప్లెక్స్, మ‌యూరీ జంక్ష‌న్ మీదుగా త‌న క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు.

కోట జంక్ష‌న్, బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు,  వ‌న టౌన్ సీఐ ముర‌ళీ తో రాత్రి పూట క‌ర్ఫ్యూ అమ‌లుపై ఆదేశాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలోన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచీ బాలాజీ మీదుగా రింగ్ రోడ్ వైపు వెళ్లే బస్సులు క‌ట్ చేయ‌డం చాలా ఇబ్బంది గా ఉంద‌ని  ఆ స‌మ‌యంలో ట్రాఫిక్ జామ్ అవుతోంద‌ని ట్రాఫిక్ ఎస్ఐ బాస్క‌ర రావు…ఎస్పీ దృష్టికి తీసుకువ‌చ్చారు.

అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిది కూడా అదే ట్రాఫిక్  స‌మ‌స్య‌ను చెప్ప‌డంతో  వాహ‌నాల మళ్లింపును  రిల‌య‌న్స్ మోర్ వైపు మార్చాలంటూ ట్రాఫిక్ పోలీసుల‌ను ఆదేశించారు.

ఈ క్ర‌మంలోనే ఇన్ క‌మ్ టాక్స్ వ‌ద్ద స‌మ‌న్వ‌తి పెట్రోల్ బంక్ వ‌ద్ద అడ్డంకిని తొల‌గించాలంటూ ట్రాపిక్ సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు.

త‌క్ష‌ణం ట్రాఫిక్ పోలీసులు ఎస్పీ ఆదేశాల‌ను అమ‌లు చేసారు.ఆ స‌మంయ‌లోనే అటు ట్రాఫిక్ డీఎస్పీకి,ఇటు వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీకి రాత్రి పూట క‌ర్ఫ్యూ ఆదేశాలు క‌ఛ్చితంగా క‌ఠిన‌తరంగా అమ‌ల‌య్యేలా సిబ్బందిని  కేటాయించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.

ఏదైనా జులై 1  నుంచీ రాత్రి పూట 9 నుంచీ అమ‌లయ్యే కర్ఫ్యూ కు సంబంధించి తీసుకుంటున్న చ‌ర్య‌లను పోలీసులు కాస్త  స‌డ‌లించారంటోంది…స‌త్యం న్యూస్.నెట్.

Related posts

సిఎం జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడిన మేనమామ

Satyam NEWS

కరోనా వైరస్ కొత్త లక్షణాలు!

Sub Editor

పార్టీ పటిష్టతే లక్ష్యంగా కన్వీనర్లు, గృహసారథుల నియామకం

Bhavani

Leave a Comment