31.7 C
Hyderabad
May 2, 2024 07: 29 AM
Slider మహబూబ్ నగర్

అచ్చంపేటలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాలల చైతన్య సమితి నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంట్ ఇంచార్జ్ ఆలూరి కార్తీక్ అచ్చంపేట కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రచన కమిటీకి చైర్మన్ గా, ప్రపంచ మేధావి విశ్వవిజ్ఞాని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను నియమించారని గుర్తు చేశారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్వీరామ పని తర్వాత, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా భారత రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథం గా తీర్చిదిద్దారని తెలిపారు. భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లైన అణగారిన వర్గాలకు విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో పాటు స్వేచ్ఛ సమానత ఆర్థిక హక్కులు కల్పించారని ఆయన అన్నారు. ప్రపంచ రాజ్యాంగాల కంటే అతిపెద్ద ప్రజాస్వామ్యబద్ధంగా న భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదింపబడిందని ఆయన తెలిపారు.

అయితే కొందరు భారత రాజ్యాంగాన్ని మార్చి వేయాలని కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అంబేద్కర్ బిడ్డలుగా ఆయన ఆశయ సాధన కోసం ముందుకు కొనసాగాలని మాలల చైతన్య సమితి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షులు పంబ వెంకటస్వామి జనరల్ సెక్రెటరీ మల్లేష్ కోశాధికారి తిరుపతయ్య వేదవస వెంకటేష్ రవి రాజు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇల్లిసిట్ లిక్కర్: ఎక్సైజ్ అధికారుల పై ఫిర్యాదుల వెల్లువ

Satyam NEWS

జర్నలిజానికి పొత్తూరి సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆశీర్వాదం తీసుకున్న విజయనగరం కొత్త క‌లెక్ట‌ర్

Satyam NEWS

Leave a Comment