పెట్రోలు ధరలు వరుసగా ఆరో రోజు పెరిగాయి. సోమవారం పెట్రోల్ ధర లీటర్ కు 31 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్ కు 21 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 78 రూపాయల 57 పైసలకు చేరుకుంది. ఇక డీజిల్ ధర 72 రూపాయల 96 పైసలుగా ఉంది. అలాగే అమరావతిలో లీటర్ పెట్రోలు రూ.78.01కాగా డీజిల్ 72.14 రూపాయలు. ఇక విజయవాడలో అయితే పెట్రోల్ లీటర్ ధర 78 రూపాయల 14 పైసలుగానూ, డీజిల్ ధర 72 రూపాయల ఒక పైసాగానూ ఉంది
previous post